SAKSHITHA NEWS

కరీంనగర్ జిల్లా వీణవంక మండలంలోని మండల ప్రజా పరిషత్ జాతీయ పంచాయతీ అవార్డ్స్

జాతీయ పంచాయతీ అవార్డ్స్ 2022 .తొమ్మిది అంశాల పైన ఒక రోజు శిక్షణ కార్యక్రమం శ్రీయుత మండలం అభివృద్ధి అధికారి అధ్యక్షతన చల్లూరు రైతు వేదిక లో జరిగినది ఇట్టి కార్యక్రమంలో జాతీయ పంచాయతీ అవార్డుల కోసము వీణవంక మండలంలోని 26 గ్రామపంచాయతీలలో 9 అంశా లు
1)పేదరిక నిర్మూలన,
2) సామాజిక భద్రత
3)బాలవికాసము 4)ఆరోగ్యము
5) నీటి వనరులు
6)మహిళా సాధికారత
7)పచ్చదనం పరిశుభ్రత 8)గ్రామీణ పరిపాలన
9)మౌలిక సదుపాయాలు

పైన ఉన్న అభివృద్ధి కార్యక్రమాలను పొందుపరిచిన ఫార్మేట్లను అనుసరించి ఆన్లైన్ నందు గ్రామ పంచాయతీల వారీగా జాతీయ పంచాయతీ అవార్డ్స్ కోసము నామినేషన్ కోసము
ఇట్టి తొమ్మిది అంశాల పైన మండల స్థాయి అధికారులు ఏఎన్ఎం లకు అంగన్వాడి కార్యకర్తలకు ఆశ వర్కర్లకు పంచాయతీ కార్యదర్శులకు అవగాహన కల్పించి శిక్షణ ఇవ్వడం జరిగినది .ఇట్టి శిక్షణ తర్వాత జాతీయస్థాయిలో ఇట్టి అంశాల పైన ఉన్న ఫార్మేట్లను పూరించి జాతీయస్థాయిలో ఉత్తమ గ్రామపంచాయతీ అవార్డుల కోసం సంబంధిత వెబ్సైట్ నందు నామినేషన్ వేయవలసిందిగా తెలియపరచమైనది.ఇట్టి శిక్షణ కార్యక్రమంలో శ్రీయుత మండల పరిషత్ అభివృద్ధి అధికారి కే శ్రీనివాస్ గారు మండల పంచాయతీ అధికారి కే ప్రభాకర్ గారు ఐసిడిఎస్ సూపర్వైజర్ శ్రీమతి శ్రీ కిరణ్మయి గారు ఆర్డబ్ల్యూఎస్ ఏఈ శ్రీమతికే శ్రావ్యరాణి గారు మండల వ్యవసాయ అధికారి శ్రీ సిహెచ్ గణేష్ గారు శ్రీ వైద్యాధికారి అఖిల్ గారు మండలంలోని అంగన్వాడి టీచర్లు ఆశా కార్యకర్తలు ఏఎన్ఎంలు మండల వ్యవసాయ విస్తరణాధికారులు పంచాయతీ కార్యదర్శులు, ఈ పంచాయతీ కంప్యూటర్ ఆపరేటర్లు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS