చింతల్ డివిజన్ లో ప్రజా గోస – శ్రీశైలం అన్న భరోసా..
NLB నగర్, పద్మశాలి బస్తీ, వివేకానంద్ నగర్, శ్రీనివాస్ నగర్ బస్తీలలో మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ గారు పాదయాత్ర…
పాదయాత్ర కు తరలివచ్చి శ్రీశైలం గౌడ్ గారి వెన్నంటే నడిచిన జనం
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం; కుత్బుల్లాపూర్ గోస – శ్రీశైలం అన్న భరోసా కార్యక్రమంలో భాగంగా చింతల్ 128 డివిజన్ పరిధిలోని NLB నగర్, పద్మశాలి బస్తీ, వివేకానంద్ నగర్, శ్రీనివాస్ నగర్ బస్తీల్లో ఈరోజు మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర నాయకుడు కూన శ్రీశైలం గౌడ్ గారు పాదయాత్ర చేపట్టారు. ఇంటింటికి తిరుగుతూ ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బస్తీల్లో గుంతలు గుంతలుగా ఉన్న రోడ్లను, డ్రైనేజ్ నీరు రోడ్లపై పొంగిపొర్లడాన్ని పరిశీలించారు. పాదయాత్రలో ప్రజలు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, పెన్షన్లు, రేషన్ కార్డులు, రోడ్లు, డ్రైనేజ్ తదితర సమస్యలను మాజీ ఎమ్మెల్యే శ్రీశైలం గౌడ్ గారి దృష్టికి తీసుకురాగా, వాటి పరిష్కారం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. బస్తీలలో బీజేపీ జెండాను మాజీ ఎమ్మెల్యే గారు ఆవిష్కరించారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు బస్తీల్లో డ్రైనేజ్ పనులు, సిసిరోడ్లు వేయించానని, ఇప్పటికీ అవే దర్శనమిస్తున్నాయని అన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద్ రెండు సార్లు గెలిచి ప్రజలకు చేసిందేమిలేదన్నారు. నల్లా బిల్లులు, కరెంట్ చార్జిలు, ఆర్టీసీ చార్జీలు, ఇంటి పన్నులు పెంచిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదని అన్నారు. అన్ని సమస్యలకు పరిష్కారం కావాలంటే బీజేపి ప్రభుత్వం రావాల్సిందేనని మాజీ ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో ఓబిసి మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సదానందం, డివిజన్ ఇంచార్జులు బిల్లా వెంకటేష్, సుశాంత్ గౌడ్, డివిజన్ & బస్తీల నాయకులు ఓరుగంటి అఖిల్ సాయి,పాల కుమార్, నరేందర్ సింగ్, సాయిరాం రెడ్డి, రాజేష్ చారి, జగదీష్ గుప్తా, అరుణ్, భాస్కర్, ప్రతాప్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, రాంరెడ్డి, నర్సింహా, పుండరీకం, తులసీరాం, సత్యం, సంతోష్, గుండప్ప, రాజేష్, రాజు, చెన్నమ్మ, నాగమణి, రజిత, యాదిలాల్, బాబు, పాల్గొన్నారు.