Postal ballot voting should be done carefully
ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్
ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత
పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ను జాగ్రత్తగా నిర్వహించాలని ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. పోస్టల్ బ్యాలెట్ సదుపాయాన్ని వినియోగించుకునేందుకు వీలుగా స్థానిక ఖమ్మం రూరల్ మండల తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్ ను రిటర్నింగ్ అధికారి పరిశీలించారు.
పోలింగ్ రిజిస్ట్రేషన్, ఓటర్స్ రిజిస్ట్రేషన్ రిజిస్టర్లను తనిఖీ చేశారు. ఓటింగ్ సరళి గురించి వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఓటింగ్ ప్రక్రియ పారదర్శకంగా, సాఫీగా జరిగేలా చూడాలని, ప్రతి అంశాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తూ ఎన్నికల సంఘం నియమ, నిబంధనలకు అనుగుణంగా పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియను నిర్వహించాలని అధికారులకు తెలిపారు.
ఓటరు హెల్ప్ లైన్ కౌంటర్ వద్దనే ఓటరు జాబితాలోని క్రమ సంఖ్య, పార్ట్ నెంబర్ ను చెక్ చేసుకోవాలని అన్నారు. ఏవైనా సందేహాలు ఉంటే ఉన్నతాధికారులను సంప్రదించాలని, అనవసర తప్పిదాలకు పాల్పడకూడదని సూచించారు. మైక్రో అబ్జర్వర్లు ఈ ప్రక్రియను నిశితంగా పరిశీలన జరుపుతారని అన్నారు.
ఖమ్మం జిల్లాలో పోలింగ్, ఫ్లయింగ్ స్క్వాడ్ తదితర నిఘా బృందాలు, మైక్రో పరిశీలకులు, పోలీస్, సెక్టార్ అధికారులు, ఎన్నికల వీధుల్లో ఉన్న ఇతర అధికారులు, సిబ్బంది మొత్తంగా 10907 మందికి పోస్టల్ బ్యాలెట్ సదుపాయం కల్పించినట్లు తెలిపారు.
కాగా, ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న ఉద్యోగులు శుక్రవారం నుండి మే 8 వరకు నిర్వహించు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని రిటర్నింగ్ అధికారి తెలిపారు.
ఈ సందర్భంగా తహసీల్దార్ రామకృష్ణ, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app
Sakshitha News
Download app
https://play.google.com/store/apps/details?id=com.sakshithaepaper.app
Sakshitha Epaper
Download app