చేనేత పై జీఎస్టీ రద్దు చేయాలి – పొన్నం ప్రభాకర్
చేనేత అభివృద్ధికి ఇచ్చిన హామీలను నెరవేర్చాలి
సాక్షిత : చేనేత దినోత్సవం సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమానికి కరీంనగర్ మాజీ పార్లమెంట్ సభ్యులు పొన్నం ప్రభాకర్ హాజరై చేనేత విగ్రహానికి పూలమాలలు వేసి ఈ సందర్భంగా మాట్లాడుతూ, చేనేత కార్మికులకు చేనేత దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, జిల్లాలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేనేత వర్గ అభివృద్ధి కోసం ఇచ్చిన హామీలను అమలు చేయడంతో పాటుగా వారి అభ్యున్నతి కోసం తీసుకున్న నిర్ణయాల పట్ల ఒకసారి పునః సమీక్షించుకొని చేనేత కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడకుండా ఆర్థికంగా వారిని ఆదుకునే విధంగా ప్రయత్నం జరగాలని ఈ సందర్భంగా కోరుకుంటూ కేంద్ర ప్రభుత్వం చేనేత పై జి.ఎస్.టి రద్దు చేయాలని, కేంద్రం ప్రకటించిన మెగా టెక్స్ టైల్ పార్క్ సిరిసిల్ల లో ఏర్పాటు చేయాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేనేత అభివృద్ధికి ఇచ్చిన హామీలను మాటలకు పరిమితం చేయకుండా ఎన్నికలలో ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చాలి అని డిమాండ్ చేశారు.