SAKSHITHA NEWS

ఖమ్మం జిల్లా :
పొంగులేటి చేసిన శపథాన్ని నెరవేర్చుకుని తన సత్తా ఏంటో చూపించారు. ఏకంగా కేసీఆర్ సర్కార్ కు సవాల్ విసిరి తనమాట నెగ్గించుకున్నారు.

2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ టికెట్ కేటాయించ కపోవడం.. సొంత పార్టీలోనే అణిచివేతకు గురి కావడంతో అసహనంగా ఉన్న ఆయన ఎన్నో రాజకీయ పరిణామాల అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరారు.

ఈ క్రమంలోనే ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి బీఆర్ఎస్ అభ్యర్థులను ఒక్కరిని కూడా అసెంబ్లీ గేటు తాకనివ్వను’ అంటూ ఆయన చేసిన శపథం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా నిలిచింది.

అయితే ఆయన అన్నట్టుగానే ఉమ్మడి ఖమ్మంలో 10 స్థానాల్లో సీపీఐతో పాటు మొత్తం 9 కాంగ్రెస్ స్థానాలను గెలిపించుకోవడంలో కీలక భూమిక పోషించారు.

భద్రాచలంలో పొంగులేటి అనుచరుడు తెల్లం వెంకట్రావు ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ పార్టీలో చేరి గెలుపొందడం గమనార్హం.

అధికార పార్టీలో అసంతృప్తిగా ఉన్న పొంగులేటిని కాంగ్రెస్, బీజేపీ తమ పార్టీలోకి లాగేందుకు శతవిధాలా ప్రయత్నించాయి.

చివరకు పొంగులేటి ఆయనతో పాటు తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ పార్టీలో చేరారు.

తుమ్మల విమర్శలు.. పొంగులేటి సవాల్ నేపథ్యంలో బీఆర్ఎస్ సైతం జిల్లాను ఎంతో ప్రతిష్టా త్మకంగా తీసుకుంది. ఇద్దరినీ ఎలాగైనా ఓడించాలని చూసినా చివరకు వృథా ప్రయాసే అయింది.

పొంగులేటి తన నియో జకవర్గం పాలేరులో తన బంధుమిత్రులతో ప్రచారం చేయిస్తూనే తాను మాత్రం ఎక్కువగా మిగతా నియోజకవర్గాల్లోనే ప్రచారం చేశారు.

మిగతా నియో జకవర్గాల గెలుపును తన భుజస్కంధాలపై వేసుకుని ముందుకు నడిచి విజయం సాధించారు.

ఖమ్మం బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రిగా ఉన్న పువ్వాడ అజయ్ కుమార్ పైనే పొంగులేటి ఎక్కువగా ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది.

అజయ్ మంత్రిగా తన ఆధిపత్యాన్ని పొంగులేటిపై చూపారని, ఒకే పార్టీలో ఉండి కూడా తనకు ప్రాధాన్యం దక్కకుండా చేశారనే కసి పొంగు లేటితోపాటు ఆయన అనుచరుల్లో మొదటి నుంచీ ఉంది.

అజయ్ కూడా పొంగులేటి ఓటమిపైనే ఎక్కువ దృష్టి పెట్టినట్టు ప్రచారం జరుగింది. ఈ క్రమంలో పొంగులేటికి తుమ్మల నాగేశ్వరరావు సైతం తోడవడంతో పువ్వాడ అవినీతి, ఆయన అనుచరుల అక్రమాలను జనాల్లోకి తీసుకెళ్లడంలో విజయం సాధించారు.

Whatsapp Image 2023 12 04 At 10.38.02 Am

SAKSHITHA NEWS