SAKSHITHA NEWS

కాంగ్రెస్ జిల్లా నాయకులు పొంగులేటి ప్రసాద్ రెడ్డి పలు కొత్త జంటలను ఆశీర్వదించారు. హైదరాబాద్ నుంచి వచ్చిన ఆయనకు నాయకన్ గూడెం టోల్ ప్లాజా వద్ద కాంగ్రెస్ నాయకులు ఘన స్వాగతం పలికారు. నాయక న్ గూడెంలో లిక్కి వెంకటేశ్వర్లు కుమారుడు ప్రదీప్ వివాహ వేడుకకు హాజరై కొత్తజంట ను ఆశీర్వదించారు. ఇదే గ్రామంలో అనారోగ్యoతో బాధపడుతున్న జహంగీర్ తల్లిని, పెరిక సింగారంలో అజ్మీరా మంగ్యాను పరామర్శించారు. అజ్మీరా దీప్లా కుమార్తె కల్యాణానికి హాజరై నూతన వధూవరులను దీవించారు. ఖమ్మం రూరల్ మండలం లో టీసీ వీ ఫంక్షన్ హాల్ లో కూసుమంచి మండలం కొత్తూరుకు చెందిన ముసుగుల వెంకటరెడ్డి కుమార్తెను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమాల్లో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, పొంగులేటి అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.