శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా మార్చి 11వ తేదీ వరకు ఖమ్మం కమిషనరేట్ పరిధిలో 30 పోలీస్ యాక్ట్ యధావిధిగా అమలులో వుంటుందని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు.
పోలీస్ యాక్ట్, 2015 (యాక్ట్ నెంబర్.3 ఆఫ్ 2015) ఆర్/ డబ్ల్యు – సెక్షన్ 22(1) (ఏ) to (ఎఫ్) సెక్షన్ 22 (3) హైదరాబాదు సిటీ పోలీస్ యాక్ట్ 1348 ఎఫ్, సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ ఆంక్షలు అమలుల్లో ఉన్నందున అనుమతి లేకుండా ఎలాంటి సభలు, ర్యాలీలకు, సమావేశాలు ,ఊరేగింపులు,
డీజే లు నిర్వహించరాదని సూచించారు. ఈ నేపథ్యంలో వివిధ వర్గాల ప్రజలు, రాజకీయ పార్టీలు, వివిధ సంఘాల నాయకులు పోలీసులకు సహకరించాలని కోరారు .ఖమ్మం పోలీస్ కమీషనరేట్ పరిధిలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా సిటీ పోలీసు యాక్ట్ అమలు చేస్తున్నట్లు పోలీస్ కమీషనర్ తెలిపారు.
డి జే లకు అనుమతి లేదు
నివాస, వాణిజ్య ప్రాంతాలలో,
బహిరంగ ప్రదేశాలలో పగటి, రాత్రి సమయాలలో పరిమితులకు మించి శబ్దాన్ని ఉత్పత్తి చేస్తున్న డి జే లతో ఊరేగింపులు చేస్తూ..
పిల్లలు, వృద్ధులు, రోగులు మరియు విద్యార్థులు,
సాదారణ ప్రజలకు,తీవ్ర అసౌకర్యాన్ని కలిగిస్తున్న డి జే లకు అనుమతి లేదని తెలిపారు. ఈ ఉత్తర్వును ఉల్లంఘించిన వారిపై మెట్రోపాలిటన్ సిటీ పోలీస్ యాక్ట్, 2016 ఐపిసి 188 మరియు అండర్ సెక్షన్ 76 శిక్షకు బాధ్యత వహిస్తారు.