SAKSHITHA NEWS

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తిస్థాయిలో వినియోగించడం ద్వారా జిల్లాలో కేసులను వేగవంతంగా చేదించగలుగుతున్నామని పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్ అన్నారు.
ఖమ్మం పోలీసు కమిషనరేట్ పరిధిలో నిర్మించిన మధిర రూరల్ పోలీస్ స్టేషన్ నూతన భవనాన్ని జెడ్పీ చైర్మన్ లింగల కమలరాజ్ తో కలసి పోలీస్ కమిషనర్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ …తెలంగాణ రాష్ట్రంలో గతంలో ఉన్న పోలీస్ స్టేషన్ల పరిస్థితులకు, ఇప్పుడు పోలీస్ స్టేషన్ల పరిస్థితులకు ఎంతో మార్పు వచ్చిందన్నారు. పోలీసు శాఖలలో చేపట్టిన అనేక సంస్కరణల ద్వారా ఆధునిక పద్దతులలో క్లిష్టమైన కేసులను సైతం అనతికాలంలో చేధిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో సైబర్ నేరాల మినహా సమాజాన్ని ప్రభావితం చేసే అన్ని రకాల నేరాలు క్రమంగా తగ్గుముఖం పట్టాయని పెర్కొన్నారు. ఫ్రెండ్లీ పోలిసింగ్ ద్వారా ప్రజలతో కలిసి పని చేయడం, మెరుగైన సంబంధాలు ఏర్పర్చుకొని పారదర్శకంగా సేవలందిస్తూ సురక్షితమైన సామాజిక వాతావరణాన్ని ఏర్పాటు చేయడంలో ఇప్పటికే సత్ఫలితాలు సాధిస్తున్నామని అన్నారు.

ముఖ్యంగా మహిళల భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాముఖ్యత ఇచ్చిందని, మహిళల సమస్యలను పరిష్కరించడానికి, వారికి భద్రత కల్పించడానికి షీ టీమ్స్, భరోసా సెంటర్, ఉమెన్ హెల్ప్ డెస్క్ ,ఉమెన్ సేఫ్టీ వింగ్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
నూతన పోలీస్‌ స్టేషన్‌ భవనంలో ఫిర్యాదుల కౌంటర్‌, ప్రత్యేక రిసెప్షన్‌, మహిళలకు ప్రత్యేక కౌన్సిలింగ్‌ ప్రత్యేక గదులు నిర్మించారని తెలిపారు. విధులు నిర్వహించే కానిస్టేబుళ్లకు విశ్రాంతి గదులు, సువిశాలమైన ప్రాంగణం, పార్కింగ్‌ వసతులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ఆనంతరం పోలీస్ స్టేషన్ అవరణలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో ట్రైని ఏఎస్పీ అవినాష్ కుమార్, వైరా ఏసీపీ రహెమాన్ , సిఐ మురళి,
మున్సిపల్ చైర్మన్ యం. లత ఎం ఎం పి శీరిష, ఎస్సే శ్రీధర్ పాల్గొన్నారు.


SAKSHITHA NEWS