SAKSHITHA NEWS

ప్రధాని మోదీతో ఏపీ సీఎం వైఎస్ జగన్ భేటీ..

……..

సాక్షిత న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఈ పర్యటనలో భాగంగా సోమవారం ప్రధాని నరేంద్ర మోదీతో సీఎం వైఎస్‌ జగన్‌ భేటీ అయ్యారు. ప్రధానితో భేటీలో సీఎం జగన్‌తో పాటు వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా ఉన్నారు. కాగా, ప్రధాని మోదీతో సమావేశం సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించనున్నారు సీఎం జగన్‌. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి సవరించిన అంచనాల మేరకు నిధుల విడుదల, నిర్వాసితులకు ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీ, రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని పెండింగ్‌ అంశాలు, నిధుల విడుదల తదితర విషయాల గురించి మాట్లాడనున్నారు. అలాగే, భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉప రాష్ట్రపతి జగదీప్‌ దన్‌కర్‌లను కూడా సీఎం వైఎస్‌ జగన్‌ కలువనున్నారు..