SAKSHITHA NEWS

WhatsApp Image 2023 08 04 at 4.34.56 PM

మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ బి.మల్లేశ్వరి

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

శ్రీ కృష్ణ ప్రసాద్ మెమోరియల్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు
ప్లాస్టిక్ వినియోగం వల్ల కలిగే నష్టాలు, ప్లాస్టిక్ వాడకం నియంత్రణపై తీసుకొవాల్సిన జాగ్రత్తలపై స్కూల్ చైర్ పర్సన్ హృదయ మీనాన్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం పోలీస్ కళ్యాణ మండపంలో శుక్రవారం జరిగింది. కార్యక్రమానికి ముఖ్యతిధిగా హజరైన మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ మాట్లాడుతూ…
నిషేధిత ప్లాస్టిక్‌ వాడకాన్ని పూర్తిగా తగ్గించి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని అన్నారు. ప్లాస్టిక్‌ వల్ల కాలుష్యం పెరిగి పర్యావరణానికి పెనుముప్పుగా మారుతోందన్నారు. నగరంలో ప్లాస్టిక్‌ నిర్ములన లక్ష్యంగా ప్రతి ఒక్కరూ సహకరించాలని సూచించారు.అందరూ సహకరిస్తే నగరాన్ని ఆదర్శ పట్టణంగా మార్చవచ్చని పేర్కొన్నారు. ఒక ఉద్యమంలా ప్లాస్టిక్ నివారణ చేపడతే పర్యావరణ పరిరక్షణకు మేలు జరుగుతుందని అన్నారు. మట్టిపాత్రలు, కాగితపు ప్లేట్లు, గుడ్డ సంచులు, స్టీలు ప్లేట్లు వినియోగించి పర్యావరణాన్ని పరిరక్షించాలన్నారు.


స్కూల్ చైర్ పర్సన్ హృదయ మీనాన్ మాట్లాడుతూ …
ప్రపంచవ్యాప్తంగా మానవాళి మనుగడకు, పర్యావరణానికి ప్లాస్టిక్‌ వ్యర్థాలు తీవ్ర హాని చేస్తున్నాయని, ప్లాస్టిక్‌ ప్రభావంతో భూమిపై నివసిస్తున్న ప్రాణులన్నింటికి పెను ప్రమాదం పొంచి ఉన్నదని అన్నారు. మనం వాడుతున్న అధిక శాతం ప్లాస్టిక్‌ ఉత్పత్తులు ఒక్కసారి మాత్రమే వాడదగినవని, రెండవ సారి పునర్వినియోగానికి అవకాశం లేకపోవటంతో వాటి వ్యర్థాలు గుట్టలుగా పేరుకుపోతున్నాయని, దీనివల్ల పర్యావరణం కలుషితమై విపరీత పరిణామాలు చోటుచేసుకుంటున్నాయని అన్నారు. అనంతరం ప్లాస్టిక్‌ నిర్ములనలో భాగస్వామ్యం అవుతామని విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు.
కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపల్ శ్రీనివాస్ రాజు,సిఐ అంజలి, ఆర్ ఐ కామరాజు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS