SAKSHITHA NEWS

Philanthropist and pro-poor MP Nama

పరోపకారి, పేదల పక్ష పాతి ఎంపీ నామ

ఆపదలో పేదలకు నామ భరోసా

నిత్యం పేదల గురించే నామ ఆలోచన

ప్రతి పేద వానికి సాయమే నామ లక్ష్యం

ఎంపీ నామ క్యాంప్ కార్యాలయంలో 104 మందికి రూ.45, 74, 500మేర సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో రాయల, నల్లమల, కూరాకుల

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

పరోపకారి, పేదల పక్షపాతి ఎంపీ నామ నాగేశ్వరరావు ప్రత్యేక చొరవ తీసుకుని పేదలకు పెద్ద ఎత్తున ఆర్ధిక భరోసా, తోడ్పాటునందిస్తున్నారని పలువురు వక్తలు పేర్కొన్నారు. ఎంపీ నామ చొరవతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఖమ్మం, అశ్వారావుపేట,మధిర, పాలేరు, సత్తుపల్లి, వైరా, కొత్తగూడెం తదితర నియోజకవర్గాలకు చెందిన 104 మంది లబ్దిదారులకు రూ. 45,74,500 మేర మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఖమ్మంలోని ఎంపీ క్యాంప్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో డిసిఎంఎస్ ఛైర్మన్ రాయల శేషగిరిరావు, డిసిసిబి ఛైర్మన్ కూరాకుల నాగభూషణం , రైతు బంధు జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేశారు.

ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల వారికి ఆపదలో ఆపన్నహస్తం అందిస్తూ చేయూతనందిస్తున్న ఎంపీ నామను రాబోయే కాలంలో మరింత ఉన్నత స్థానంలో ఉండేలా చూడాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ పేద కుటుంబాలకు ఎంతో ఆసరాగా నిలుస్తుందని డీసీఎంఎస్ ఛైర్మన్ రాయల శేషగిరిరావు పేర్కొన్నారు. ఎంపీ నామ పేదల వీరాభిమాని అన్నారు.

పేదలకు ఏదైనా కష్టమొచ్చిందంటే ఆఘమేఘాల మీద వాటి పరిష్కారానికి ఎంతో శ్రమిస్తారని పేర్కొన్నారు. ఎంపీ నామ ఆపదలో పేదలను ఆదుకుంటూ కొండంత అండగా నిలుస్తున్నారని అన్నారు.ప్రతి నెలా కోటి నుంచి కోటిన్నర వరకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేస్తూ పేదల సేవలో ముందుకెళుతున్న నామాకు అన్ని విధాలా అండగా ఉండి, కాపాడుకోవాలన్నారు. ఆయన ప్రతినిత్యం పేదల గురించే అలోచిస్తుంటారని, పార్లమెంట్ లో ఉన్నా ఖమ్మం జిల్లా ప్రజల గురించే ఆలోచన చేస్తూ ఉంటారని రైతు బంధు జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు పేర్కొన్నారు.

రాజకీయాలకతీతంగా నామ పేదలకు ఆర్థిక లబ్ధిచేకూరుస్తూ వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్నారని అన్నారు. కష్టాల్లో ఉన్న పేదలను ఆపద్బంధువుగా ఆదుకుంటూ తానున్నాంటూ భరోసా కల్పిస్తున్నారని నల్లమల తెలిపారు. మానవతా | దృక్పధంతో దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికీ సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆర్థిక సాయం అందేలా నామ కృషి చేస్తున్నారని అన్నారు.దేశంలో ఏ రాష్ట్రంలో లేని సంక్షేమ పధకాలు తెలంగాణలో అమలులో ఉన్నాయని, కేసీఆర్ సీఎం కావడం తెలంగాణ ప్రజల అదృష్టమని అన్నారు.

కేసీఆర్ సుభిక్షపాలన వల్ల రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఏదో రూపంలో లబ్ది పొందూతూనే ఉన్నారని పేర్కొన్నారు.దేశంలో ఏ రాష్ట్రంలో లేని సంక్షేమ పధకాలు తెలంగాణలో అమలులో ఉన్నాయిని, ఇది ప్రజల అదృష్టమని అన్నారు. కేసీఆర్ సుభిక్షపాలన వల్ల రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఏదో రూపంలో లబ్ధిపొందుతూనే ఉన్నారని అన్నారు. ఆపదలో సీఎం రిలీఫ్ ఫండ్ ఎంతగానో ఉపయోగపడుతుందని డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం పేర్కొన్నారు.

ఎటువంటి కష్టమున్నా నేనున్నాంటూ ముందుకు వచ్చే నామాకు ప్రతి ఒక్కరం అండగా ఉండాలని కూరాకుల కోరారు. ఈ కార్యక్రమంలో దిశ కమిటీ సభ్యులు కట్టా కృష్ణార్జునరావు, వైరా , చింతకాని ఎంపీపీలు వేల్పుల పావని, పూర్ణయ్య, చింతకాని, బోనకల్, ఎర్రుపాలెం, కారేపల్లి మండలాల పార్టీ అధ్యక్షులు పెంట్యాల పుల్లయ్య, చేబ్రోలు మల్లిఖార్జున్ రావు, పి. సాంబశివరావు, ఉమాశంకర్, చింతకాని జెడ్పీటీసీ తిరుపతి కిషోర్, వైరా మున్సిపల్ వైస్ చైర్మన్ ముళ్లపాటి సీతారాములు, కారేపల్లి సొసైటీ చైర్మన్ శ్రీనివాసరావు, రాజేశ్వరపురం సర్పంచ్ దండా పుల్లయ్య, ముదిగొండ మండల రైతుబంధు అధ్యక్షులు పోట్ల ప్రసాద్, పార్టీ ముదిగొండ మండల కార్యదర్శి గడ్డం వెంకటేశ్వర్లు,

చిన్న వీరాస్వామి, దిశ కమిటీ సభ్యులు చింతలచెర్వు లక్ష్మీ, బాణోత్ కుమార్, రావినూతల సర్పంచ్ కొమ్మినేని ఉపేందర్, చింతకాని వైస్ ఎంపిపి గురజాల హన్మంతరావు,నాయకులు వనమా విశ్వేశరరావు, పసుపులేటి మోహనరావు, డేగల ఉపేందర్, అనంతసాగర్ సర్పంచ్ నూతలపాటి మంగతాయారు వెంకటేశ్వరరావు, నాయకులు కనకమేడల సత్యనారాయణ, చిత్తారు సింహాద్రి యాదవ్, బత్తుల శ్రీనివాసరావు, తన్నీరు రవికుమార్, బంధం నాగేశ్వరరావు, మంకెన రమేశ్, లగడపాటి రమేష్,పోట్ల శ్రీనివాసరావు, పచ్చా సీతారామయ్య, నామ సేవా సమితి నాయకులు చీకటి రాంబాబు, ఎన్. కాళేశ్వరరావు,బొర్రా నర్సింహారావు, సోషల్ మీడియా మధిర నియోజకవర్గ ఇన్చార్జి తాళ్లూరి హరీష్, వివిధ మండలాల సోషల్ మీడియా ఇంచార్జ్ లు , పార్టీ అనుబంధ సంఘాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS