SAKSHITHA NEWS

హైదరాబాద్ : తెలంగాణలో మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం రద్దు చేయాలని హైకోర్టులో పటిషన్ దాఖలైంది. ఉచిత పథకం ద్వారా ప్రయాణికుల సంఖ్య పెరిగిందని.. అవసరం లేకున్నా మహిళలు బస్సుల్లో ప్రయాణిస్తున్నారని.. దాంతో అవసరాల కోసం ప్రయాణించేవారకి తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి నాగోల్ కు చెందిన ఓ ఉద్యోగి కోర్టులో పిల్ వేశారు.

ఈ పథకం అమలు కోసం జారీచేసిన జీవో 47 వెంటనే రద్దు చేయాలి పిటిషనర్ కోరారు.ఎన్నికల్లో ఇచ్చిన హామీని అధికారంలోకి వచ్చిన 48 గంటల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసింది. ఆరు గ్యారంటీల్లో ఒకటైన మహిళలకు ఉచిత రావాణా పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకాన్ని రాష్ట్రంలోని మహిళలందరూ తెగ ఉపయోగించుకుంటున్నారు. దాంతో ఆర్టీసీ బస్సుల్లో విపరీతంగా రద్దీ పెరిగింది. అధిక సంఖ్యలో మహిళలు బస్సుల్లో ప్రయాణిస్తుండడంతో మగవాళ్లకు సీట్లు దొరకడం లేదు. దీంతో పురుషులందరూ ఈ పథకాన్ని వ్యతిరేకిస్తున్నారు.

Whatsapp Image 2024 01 18 At 4.00.44 Pm

SAKSHITHA NEWS