మహబుబాబాద్ జిల్లా పోలిస్
ప్రజలు ధైర్యంగా, స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలి.
*ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలి : సుదీర్ రామనాద్ కేకన్ IPS
పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన సందర్భంగా మహబుబాబాద్ జిల్ల పరిధిలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నామని మహబూబాద్ జిల్ల SPగారు ఈరోజు కొత్తగూడ మండల కేంద్రంలో ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతియుతంగా ఎన్నికలు జరిగేలా, ప్రజలు తామ ఓటు హక్కు వినియోగించుకునెలా వారిలో నమ్మకం, భరోసా, భద్రత కలిగేలా జిల్ల కు వచ్చిన సీఆర్పీఎఫ్ బలగాలతో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు.
ఈ సందర్భంగా SPగారు మాట్లాడుతూ… పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఓటర్లలో ఎలాంటి భయాందోళనకు తావు లేకుండా చేయడంలో భాగంగా స్థానిక పోలీసులు, మరియు CRPF బలగాలు ఫ్లాగ్ మార్చ్ ద్వారా ప్రజలందరికీ ఎన్నికల పట్ల భద్రత, భరోసా కల్పించడానికి ఫ్లాగ్ మార్చ్ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు. ముఖ్యంగా సమస్యత్మక గ్రామాల పై ,నక్షలప్రభావిత గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించి జిల్లా పరిధిలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరుగుతుందని, ఎవరైనా అల్లర్లు సృష్టించాలని చూస్తే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని SP గారు హెచ్చరించారు.పార్లమెంట్ ఎన్నికల లో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ప్రశాంత వాతావరణంలో స్వేచ్ఛగా పారదర్శకంగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని SP గారు తెలిపారు. జిల్లాలో అక్రమంగా డబ్బు, మద్యం, గంజా, ఇతర విలువైన వస్తువులు అక్రమ రవాణా అరికట్టేందుకు చెక్ పోస్ట్ దగ్గర, జిల్లా పరిధిలో ఆకస్మికంగా పకడ్బందీగా నాఖబంది, వాహనాల తనిఖీలు నిర్వహించడం జరుగుతుందని SP గారు తెలిపారు.
కార్యక్రమం తరువాత .గంగారాం మండలం వైపు బైకు పై వెళ్తూ మార్గమధ్యలో తిరుమలగండి వద్ద యువత క్రికెట్ ఆడుతుండగా వారితో సరదాగా క్రికెట్ ఆడి యువతను ఉఠేజింపచేసారు. అలాగే స్వయముగా బైకు నడుపుతూ గంగారం మండలములో పర్యటించి సిబ్బందికి ఎలక్షన్ కు సంబంధించి సూచనలు చెసారు .
ఈ కార్యక్రమంలో మహబుబాబాద్ DSP .N .తిరుపతి రావు ,గూడురు CI బాబురావు ,మహబూబాద్ రూరల్ ,బయ్యరం CI లు ,మహబూబాద్ డివిజన్ పరిదిలోని SI లు ,పోలిస్ సిబ్బంది ,CRPF సిబ్బంది పాల్గోన్నారు .