మనవపాడు:-గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు మనవపాడు మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సబ్ఇన్స్పెక్టర్ రాము సూచించారు. తన కార్యాలయం నుండి ప్రకటన చేశారు. ఈ సందర్భంగా ఎస్సై రాము మాట్లాడుతూ… వాగులు, వంకలు పొంగిపొర్లి చెరువులు కుంటలు నిండుకుండలాగా ఉన్నాయి. కావున ప్రమాదకరంగా ఉన్న చెరువులు, కుంటల వద్దకు పిల్లలు, యువత ఎవరూ చేపల వేటకు వెళ్లొద్దు అని అన్నారు.
ఆయా గ్రామాల సర్పంచులు చెరువుల వద్ద, వాగుల వద్ద ప్రమాద హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాల్సిందిగా సూచించారు. వర్షానికి ప్రజలు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మట్టి ఇండ్లు కూలిపోయే అవకాశం ఉంటుందని, అందులో నివసించే వారు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సెల్ఫీ మోజులో పడి ప్రాణాలు కోల్పోవద్దు అని చెప్పారు. ప్రజలు అప్రమత్తంగా ఉంటూ తక్షణ సహాయం కోసం డయల్ 100కు సమాచారం ఇవ్వాలని కోరారు. కరెంటు స్తంభాల దగ్గరకు ఎవరూ వెళ్లకూడదని కోరారు. రోడ్ల పైన చెట్లు పడితే పోలీస్ శాఖ వారికి సమాచారం అందించాలని సూచించారు.