సాక్షిత : ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని జానకి రామ టవర్స్ ప్రహరీ గోడ కూలడంతో ఘటన స్థలానికి వెళ్లి అపార్ట్మెంట్స్ వాసులతో కలిసి పరిశీలించిన కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు .
ఈ సందర్బంగా కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు మాట్లాడుతూ అలీ తలాబ్ చెరువు నుండి దిగువకు నీరు వెళ్లే తూము కాలువ పైప్ లైన్ నిర్మాణ పనులను త్వరితగతిన చేపట్టి, ప్రహరీ గోడ నిర్మించి అపార్ట్ మెంట్ వాసులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలని జిహెచ్ఎంసి అధికారులకు సూచించారు. అదేవిధంగా ముంపు ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టిసారించాలని, వరద నీరు రోడ్లపై నిలవకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అదేవిధంగా ప్రజలు అందరు వర్షకాలంను దృష్టిలో పెట్టుకొని అప్రమత్తంగా ఉండాలని , అత్యవసరమైతే తప్ప ఇంటి నుండి బయటకు రావొద్దు అని, ప్రతి ఒక్కరు కనీస స్వీయ రక్షణ చర్యలు పాటించాలని, భారీ వానల నేపథ్యంలో ప్రజలు బయటకు వెల్లకుండా వుండాలని, తగు స్వీయ జాగ్రత్తలు పాటించాలని కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు ప్రజలకు విజ్జప్తి చేశారు. అదేవిధంగా ఇంకా ఏదైనా సమస్యలు ఉంటే నేరుగా నా దృష్టికి గాని కార్పొరేటర్ కార్యాలయం దృష్టికి వచ్చిన ప్రతి సమస్యను తప్పకుండా పరిష్కరిస్తానని కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు తెలియచేసారు. ఈ కార్యక్రమంలో వర్క్ ఇన్స్పెక్టర్ మహాదేవ్, డివిజన్ ఉపాధ్యక్షుడు పోతుల రాజేందర్ అపార్ట్మెంట్ వాసులు హరి సురేష్ బాబు, కోటేశ్వరరావు, శ్రీనివాస్, వెంకట్ కృష్ణ, భరద్వాజ, ఆదినారాయణ, కిరణ్ , విజయ్, మూర్తి, శ్రీనివాస్ రెడ్డి, నవీన్, చంద్రశేఖర్, చైతన్య, ప్రసాద్, ప్రభాకర్, నాగేశ్వరరావు, రామకృష్ణ రాజు, రామకృష్ణ, అనిల్, రాoశిష్ శర్మ, రంజిత్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.