SAKSHITHA NEWS

జిల్లాలో భారీ వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

రాష్ట్ర న్యాయ మరియు మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ గారు

నంద్యాల జిల్లాలో ఈనెల 16,17 తేదీల్లో భారీ వర్షాలు పడుతున్న సందర్భంగా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర న్యాయ మరియు మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ సందర్భంగా మంత్రి ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ పోలీస్ వ్యవస్థ, విపత్తు నిర్వహణ శాఖ అధికారులు 24×7 అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రాణ, ఆస్తి నష్టం, జరగకుండా నియంత్రణ చర్యలు చేపట్టేందుకు సిద్ధంగా ఉండాలని అతి భారీ వర్షాలు పడే ప్రాంతాలలో ప్రజలకు ముందస్తుగా సమాచారం ఇచ్చి వారిని అప్రమత్తం చేయాలన్నారు. ప్రజల మొబైల్ ఫోన్ లకు భారీ వర్షాలపై మెసేజ్ లు పంపి అలర్ట్ చేయాలన్నారు.

వర్షాల వల్ల గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ్య సమస్యలు తలెత్తకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. వరద ప్రవాహాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు సేకరిస్తూ ప్రజలను అప్రమత్తం చేయాలని ఇరిగేషన్ అధికారులను కోరారు. వర్షాల వల్ల వాగులు, వంకలు పొంగే అవకాశం ఉన్నందున అధికారులంతా అప్రమత్తంగా ఉండి ఎప్పటికప్పుడు సహాయక చర్యలు చేపట్టేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. ప్రతి అధికారి కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా సమన్వయంతో సహాయక చర్యలు చేపట్టేలా సిద్ధంగా ఉండాలని మంత్రి ఫరూక్ తెలిపారు.


SAKSHITHA NEWS