బతికినంత కాలం విలువలతో జీవించారు
వారి పవిత్రాత్మకు శాంతి కలగాలి
తొట్టెంపూడి వెంకట సుబ్బారావు సంస్మరణ సభలో ఎంపీ నామ నాగేశ్వరరావు నివాళ
పుట్టిన వారు గిట్టక తప్పదు కానీ తన మామ తొట్టెంపూడి వెంకట సుబ్బారావు బతికినంత కాలం ఎంతో విలువలతో జీవించిన గొప్ప వ్యక్తి అని బీఆర్ఎస్ లోక్ సభా పక్ష నేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు కొనియాడారు. ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన సుబ్బారావు సంస్మరణ సభ హైదరాబాద్ జూబ్లిహిల్స్ లోని ఓ హోటల్ కాన్ఫరెన్స్ హాలులో జరగగా ఎంపీ నామ నాగేశ్వరరావు పాల్గొని, సుబ్బారావు చిత్ర పటానికి పూల మాల వేసి, శ్రద్ధాంజలి ఘటించి, నివాళులర్పించారు. ఈ సందర్భంగా నామ నాగేశ్వరరావు మాట్లాడుతూ సుబ్బారావు అందించిన సేవలను, ఆయన గొప్ప వ్యక్తిత్వాన్ని వివరించారు.
నా మామ అని కాదు గానీ సుబ్బారావు చాలా గొప్ప వ్యక్తి.. బతికినంత కాలం విలువలతోనే జీవించారు.. ఇటువంటి వ్యక్తులు ప్రస్తుత సమాజంలో చాలా అరుదుగా కనిపిస్తారని నామ నాగేశ్వరరావు చెప్పారు. తన జీవితంలో ఎంతో మందిని చూశాను.. కానీ సుబ్బారావు లాంటి వ్యక్తిత్వం.. మనస్తత్వం ఉన్న వారిని చూడడం చాలా ఆరుదుగానే భావిస్తున్నానని అన్నారు. ఏమీ ఆశించే మనిషికాదు.. లండన్ లో చదువుకుని ఇక్కడి కి వచ్చి ప్రొఫెసర్ అయిన తర్వాత ఆయన ఎంతో మంది పీ హెచ్ డీ విద్యార్థులను తయారు చేశారని పేర్కొన్నారు. ఇప్పుడు వారంతా సుబ్బారావు లేరని తెలిసి ఎంతో బాధ పడుతున్నారని అన్నారు. తమది పెద్ద కుటుంబమని, ఆయన దగ్గరుండి ఎంతో ప్రేమతో అందర్నీ చూసుకునే వారని గత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. చికిత్స సందర్భంలో మధ్యలో రికవరీ అయి వస్తారని అనుకున్నానని, కానీ ఈరోజు మన మధ్యలో లేరని నామ నాగేశ్వరరావు పేర్కొన్నారు. వారి పవిత్రాత్మకు శాంతి కలగాలని దైవాన్ని ప్రార్థిoచారు.ఈ కార్యక్రమంలో పలువురు రాజకేయ, అధికార, అనధికార ప్రముఖులు తో పాటు నల్లమల వెంకటేశ్వరరావు , తాళ్లూరి జీవన్, కోనేరు చిన్ని , కనకమేడల సత్యనారాయణ , బాణాల వెంకటేశ్వరరావు, చిత్తారు సింహాద్రి యాదవ్ , మోరంపూడి ప్రసాద్ , వాకదాని కోటేశ్వరరావు , చీకటి రాంబాబు , రేగళ్ల కృష్ణ ప్రసాద్ తదితరులు పాల్గొని, సుబ్బారావు మృతికి సంతాపం తెలిపి, నివాలర్పించారు.