SAKSHITHA NEWS

సాక్షిత : లక్షెట్టిపేట పట్టణంలోని అంబెడ్కర్ చౌరస్తా వద్ద కాంగ్రెస్ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసిన పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు డాక్టర్ బోర్లకుంట వెంకటేష్ నేత , శాసనసభ్యులు నడిపల్లి దివాకర్ రావు మరియు నియోజకవర్గ బిఆర్ఎస్ నాయకులు….

ఈ సందర్భంగా పార్లమెంటు సభ్యులు డాక్టర్ బోర్లకుంట వెంకటేష్ నేత మాట్లాడుతూ…

సన్న చిన్న కారు రైతులపై రేవంత్ రెడ్డి విద్వేషం…

తెలంగాణ రైతాంగాన్ని కించపరుస్తూ విషం చిమ్మిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు..

అమెరికా పర్యటనలో రేవంత్ రెడ్డి చేసిన రైతు వ్యతిరేక వ్యాఖ్యలపై విస్మయం చెందుతున్న తెలంగాణ సమాజం…
రైతాంగానికి ఉచిత కరెంటు ఇవ్వద్దంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పు పట్టిన రేవంత్ రెడ్డి…

ఇవాళ కరెంటు అక్కర లేదు అన్న రేవంత్ రెడ్డి రేపు అధికారంలోకొస్తే సాగునీళ్లు అక్కరలేదు..రైతుబంధు అక్కర లేదు.. ఉచితాల పేరుతో ఏవి పేదలకు రైతులకు అఖరలేదు.. డబ్బు దుబార..అనే ప్రమాదం ఉందంటున్న రాజకీయ విశ్లేషకులు.. భయపడుతున్న సామాన్యులు..

తెలంగాణకు ప్రమాదంగా దాపురించిన కాంగ్రెస్ పార్టీ వైఖరి..

మొదటినుంచి కాంగ్రెస్ పార్టీది రైతాంగ వ్యతిరేక ధోరణి కావడం వల్లనే 75 ఏళ్ల స్వతంత్ర భారతంలో ఒక్క రైతు అనుకూల కార్యక్రమం చేయలేదు..

వ్యవసాయం చేసే రైతుల పట్ల దళిత బహుజనుల పట్ల మొదటి నుంచి కూడా ఇదే పెత్తందారి పోకడ..

సన్న చిన్న కారు రైతులు అంటే కనీస మర్యాద లేని నాయకులు తెలంగాణ కాంగ్రెస్ లో ఉన్నారడానికి ఇది ఒక ఉదాహరణ మాత్రమే అన్నారూ..


SAKSHITHA NEWS