పెండింగ్ మెస్ చార్జీలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని పి.డి.యస్. యూ ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నీరసన
రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ హాస్టళ్లలో ఉంటున్న విద్యార్థులకు చెల్లించాల్సిన పెండింగ్ మెస్ చార్జీలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని పి.డి. యస్. యూ ఖమ్మం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు లక్ష్మణ్, వెంకటేష్ లు ప్రభుత్వన్ని స్థానిక NSP క్యాంపునందు ధర్నాచేసి ప్రభుత్వన్ని డిమాండ్ చేశారు.
ఈ సందర్బంగా పి.డి. యస్. యూ ఖమ్మం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు లక్ష్మణ్, వెంకటేష్ లు మాట్లాడుతూ
గత సంవత్సర కాలంగా బి.అర్.ఎస్ ప్రభుత్వ హయాంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ వసతి గృహాలు, కస్తూర్బా పాఠశాలలు, ఆశ్రమ పాఠశాలలకు సంబంధించిన మెస్ చార్జీలు రూ.కోట్లలో పెండింగ్లో ఉన్నాయన్నారు. దీంతో వసతి గృహ సంక్షేమ అధికారులు అప్పులు తెచ్చి వసతి గృహాలను నిర్వహిస్తున్నారన్నారు. ఆర్థిక భారం వల్ల విద్యార్థులకు సరైన పౌష్టికాహారం అందించలేకపోతున్నారని గత ప్రభుత్వం పై వారు ఆవేదన వ్యక్తం చేశారు..
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేళ్లు కావొస్తున్నా గత ప్రభుత్వం పాలనలో సంక్షేమ హాస్టళ్ల పరిస్థితి మారకపోగా, రోజు రోజుకీ క్షీణిస్తోందని, తద్వారా విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిందని వారు ఆందోళన వ్యక్తం చేశార. సంక్షేమ హాస్టళ్లలో సమస్యలు పెనుభూతంగా మారాయన్నారు. మూడు పూటల భోజనం గాను కేవలం ఒక్కో విద్యార్థికి రాష్ట్రప్రభుత్వం రూ.33 మాత్రమే ఖర్చు పెడుతుందని, నేరాలు చేసి వచ్చిన ఖైదీలకు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం రూ.70 ఖర్చు పెడుతోందని వాపోయారు. అంతే కాకుండా నెల నెలా ఇచ్చే కాస్మొటిక్ చార్జీలు కూడా రూ.62 మాత్రమే విద్యార్థికి అందిస్తోందని వాపోయారు. ఇప్పటికైనా తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం స్పందించి పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్, కాస్మొటిక్ ఛార్జీలు పెంచాలని పెండింగ్ లో ఉన్న మెస్, కాస్మోటిక్ చార్జీలు విడుదల చేయాలనీ కొత్త ప్రభుత్వన్ని డిమాండ్ చేశారు.
. ఈ కార్యక్రమం లో పి. డి. ఎస్. యూ ఖమ్మం జిల్లా నాయకులు కరుణ్, సందీప్, ప్రసాద్, శ్రీను తదితరులు పాల్గొన్నారు. .