SAKSHITHA NEWS

Pawan financial assistance to the victims who have lost their homes

ఇప్పటంలో ఇళ్లు కోల్పోయిన బాధితులకు పవన్ ఆర్థిక సాయం


సాక్షిత గుంటూరు: గుంటూరు జిల్లా ఇప్పటంలో రోడ్డు విస్తరణలో భాగంగా ఇళ్లు కూల్చివేతకు గురైన బాధితులకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేయూతనందించారు.

స్వయంగా ఇప్పటం వెళ్లి బాధితులను పరామర్శించి, వారి ఆవేదనను విన్న పవన్ తాజాగా వారికి లక్ష రూపాయాల ఆర్థిక సాయం ప్రకటించారు.ఈ విషయాన్ని జనసేన నేత నాదెండ్ల మనోహర్ మీడియాకు తెలియజేశారు.నాదెండ్ల మాట్లాడుతూ……ఇప్పటం గ్రామంలో వైసీపీ ప్రభుత్వం దాష్టీకానికి ఇళ్ళు దెబ్బ తిన్నవారు,ఆవాసాలు కోల్పోయారన్నారు.పవన్ కళ్యాణ్ బాధితులకు లక్ష రూపాయలు సాయం ప్రకటించారని తెలిపారు.

తన వంతున ఆర్ధికంగా అండగా నిలబడాలని తమ అధినేత నిర్ణయించారని అన్నారు.జనసేన ఆవిర్భావ సభకు ఇప్పటం వాసులు సహకరించారని,సభా స్థలిని ఇచ్చారని కక్షగట్టి ఇళ్లను కూల్చడం దుర్మార్గమని మండిపడ్డారు. జె.సి.బి.లను పెట్టి, పోలీసులను మోహరింప చేసి అరెస్టు చేయించారన్నారు.

ఈ సంఘటన రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైందని ఆయన తెలిపారు.ఘటన జరిగిన మరునాడే పవన్ కళ్యాణ్ ఇప్పటం సందర్శించి బాధితులను పరామర్శించారన్నారు.

ఇళ్ళు దెబ్బతిన్నా ధైర్యం కోల్పోని ఇప్పటంవాసుల గుండె నిబ్బరాన్ని చూసి చలించిపోయారని బాధితులకు జనసేన అండగా ఉంటుందని ప్రకటించారని అన్నారు. నైతిక మద్దతుతో పాటు ఆర్ధికంగా కూడా అండగా నిలబడాలని లక్ష రూపాయల వంతున భరోసాను ఇప్పుడు ప్రకటించినట్లు చెప్పారు.ఈ మొత్తాన్ని త్వరలోనే పవన్ కళ్యాణ్ స్వయంగా అందచేస్తారని నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు.


SAKSHITHA NEWS