Parties should take advantage of Lok Adalat for speedy resolution
కక్షిదారులు సత్వర పరిష్కారం కొరకు లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలి జిల్లా ఎస్పీ సిధ్ధార్థ్ కౌశల్
సాక్షిత కర్నూల్ జిల్లా
కర్నూలు తాలూకా పోలీసు స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన. జిల్లా ఎస్పీ. ఈ నెల (ఫిబ్రవరి) 11 న నేషనల్ మెగా లోక్ అదాలత్ .ఫిబ్రవరి 11 వ తేదిన జాతీయ మెగా లోక్ అదాలత్ లో భాగంగా కర్నూలు , బి. తాండ్రపాడు దగ్గర ఉన్న కర్నూలు తాలూకా పోలీసు స్టేషన్ ను జిల్లా ఎస్పీ సిధ్ధార్థ్ కౌశల్ ఐపియస్ గురువారం ఆకస్మిక తనిఖీ చేశారు. లోక్ అదాలత్ లో భాగంగా పోలీసుస్టేషన్ కు వచ్చిన కక్షిదారులు, ఇరుపక్షాల వారికి జిల్లా ఎస్పీ కౌన్సిలింగ్ చేశారు.
ఫిబ్రవరి 11 న జరగబోయే జాతీయ మెగా లోక్ అదాలత్ కార్యక్రమం గురించి జిల్లాలోని అన్ని పోలీసుస్టేషన్ లలో సత్వర న్యాయమేళాకౌన్సిలింగ్నినిర్వహిస్తున్నారన్నారు. పెండింగ్ కేసులలోని కక్షి దారులకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఇరు పక్షాలవారికి కౌన్సిలింగ్ని నిర్వహిస్తున్నారన్నారు. నోటీసులు అందిన కక్షిదారులు వారి కేసులను లోక్‌అదాలత్‌లో రాజీద్వారా పరిష్కరించుకొనేందుకు ముందుకు రావాలన్నారు.
కేసులు రాజీ ద్వారా పరిష్కరించుకుంటే సమయం తగ్గుతుందని, డబ్బు ఆదా అవుతుందని, కక్షిదారులు లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకొని కేసులను పరిష్కరించుకోవాలని సూచించారు.చిన్న చిన్న విషయాలకు ఘర్షణలతో పెండింగ్ కేసులు పేరుకు పోయాయని, రాజీ అయి కలిసి మెలిసి ఉండాలని తెలిపారు. కేసుల సత్వర పరిష్కారం కోసం నిర్వహిస్తున్న లోక్ అదాలత్ లో ఎక్కువ కేసులు పరిష్కరించేలా చూడాలని, రాజీ అయ్యే వారికి కౌన్సిలింగ్ చేసి పెండింగ్ లో ఉన్న కేసులను తగ్గించాలని పోలీసు అధికారులకు ఎస్పీ తెలిపారు.
విలేజ్ విజిట్ లు పెంచాలన్నారు. ఈ కార్యక్రమంలో కర్నూలు తాలుకా సిఐ రామలింగయ్య, ఎస్సైలు లక్ష్మీనారాయణ, మన్మథ విజయ్ ఉన్నారు.