ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించిన భూమన కరుణాకర రెడ్డి
తిరుపతి
టీటీడీ చైర్మన్, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి …స్థానిక 36 వ డివిజన్ 36,37,60 పోలింగ్ బూత్ ల పరిధిలో కార్పొరేటర్ కుడితి సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటా కరపత్రాలు అందజేస్తూ ఫ్యాన్ గుర్తుకే ఓట్లు వేయాలని అభ్యర్థించారు. జగనన్న సంక్షేమ పథకాల గురించి ఆరా దీశారు. ఇంకా ఎవరికైనా రావాల్సి ఉంటే వారందరికీ జగనన్న పథకాలను అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా తిరుపతి ని అభివృద్ధి కి అహర్నిశలు కృషి చేస్తున్న భూమన అభినయ్ కే తామంతా ఓట్లు వేస్తామని ప్రజలంతా ముక్తకంఠంతో ప్రకటించారు.
ఈ కార్యక్రమం లో నాయకులు దొడ్డారెడ్డి సిద్ధారెడ్డి, ఖాదర్ భాషా, కొత్తప్ప ద్వారకనాధ్, ఎన్ వీ సురేష్, నైనారు మధుబాల, మల్లం రవిచంద్రా రెడ్డి,
ఫరీద్,గౌస్ భాషా, చెరుకుల వెంకటేష్, చెరుకుల కిశోర్, బండ్ల చంద్ర శేఖర్ రాయల్,
సత్యా, కార్తీక్, సులేమా, శేఖర్ యాదవ్, అముదాల విజయ్, విజయలక్ష్మి, రాసర్ల భాస్కర్ రాయల్, నారాయణ,తంబి, అరుణ, అజయ్ కుమార్ పాల్గొన్నారు.
28 వ డివిజన్ లో భూమన కరుణాకర రెడ్డి ఎన్నికల ప్రచారం…..
కార్పొరేటర్ పొన్నాల చంద్రా రాయల్ ఆధ్వర్యంలో
28 వ డివిజన్
62,63,64,65,66 పోలింగ్ బూత్ ల పరిధిలో భూమన కరుణాకర రెడ్డి ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. భూమన అభినయ్ కి ఓట్లు వేసి, అత్యధిక మెజారిటీతో గెలిపించు కుంటామని స్థానికులు ప్రకటించారు.ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు విజయ భాస్కర్ రెడ్డి, శ్రీనివాసులు రెడ్డి, జక్కా శరత్, శివాచ్చారి, ఓమ్ ప్రకాష్, అయ్యప్ప, ఉదయగిరి భాస్కర్, చింతల శ్రీధర్ రెడ్డి, సురేష్ రాయల్ , అనూషా, విజయలక్ష్మి పాల్గొన్నారు.
17వ డివిజన్ లో భూమన ప్రచారం…
స్థానిక 17 వ డివిజన్, 158, 159 పోలింగ్ బూత్ ల పరిధిలో నాయకుడు
తాళ్లూరు ప్రసాద్ ఆధ్వర్యంలో భూమన కరుణాకర రెడ్డి ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. భూమన అభినయ్, గురుమూర్తికే ఓట్లు వేస్తామని ప్రజలు చెప్పారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ఎస్ కే బాబు, నాయకులు
హరికృష్ణ యాదవ్, చేజెర్ల మురళి, ఉదయగిరి రమేష్, నల్లాని బాబు, కడపగుంట అమరనాధ రెడ్డి, ఉమాపతి, హెచ్ కే రెడ్డి,
మొగరాల శివ, పల్లవి,మురుగేష్, విజయ గాంధీపాల్గొన్నారు.