ఈనెల 30వ తేదీన జరుగు సార్వత్రిక ఎన్నికల్లో ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలని.. ఓటు అనేది మన భవిష్యత్తును నిర్ణయించేదని.. మనం ఎన్నుకున్న నాయకుల ద్వారా మన పరిపాలన సుభిక్షంగా సాగేలా చూసుకోవాలని అన్నారు.
ఈ సందర్భంగా గత పది ఏళ్లుగా జరిగిన అభివృద్ధిని ప్రస్తావిస్తూ అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా ముందుకు వెళుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నో ప్రతిష్టాత్మక పనులను కేవలం 10 ఏళ్లలో చేసి చూపించారని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు వేలకోట్ల రూపాయలతో కూకట్పల్లి నియోజకవర్గం అభివృద్ధి చేశారని అన్నారు .ఈ సందర్భంగా తిరిగి మళ్లీ ప్రజలు ఆలోచించి అభివృద్ధికి పట్టం కడతారని ఆశిస్తున్నానని అన్నారు.. అందుకే అందరం కారు గుర్తుపై ఓటు వేసి మాధవరం కృష్ణారావుని అఖండ మెజార్టీతో గెలిపించుకుందామని పిలుపునిచ్చారు..