SAKSHITHA NEWS

ఏకగ్రీవ తీర్మానం చేసిన రాష్ట్ర వంశ రాజ్ సంక్షేమ సంఘం రాష్ట్ర సంఘం కమిటీ

రాష్ట్ర చరిత్రలో ఎక్కడా లేని విధంగా మొదటి సారి గా ఒక అభ్యర్థికి మద్దతు ప్రకటించిన రాష్ట్ర కమిటీ సభ్యులు

ఉప్పల్ నియోజకవర్గ BRS పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి కే మా మద్దతు అని రాష్ట్ర వంశ రాజుల సంఘం రాష్ట్ర కమిటీ ప్రకటించింది
ఏకగ్రీవ తీర్మానం చేసిన రాష్ట్ర వంశ రాజ్ సంక్షేమ సంఘం రాష్ట్ర సంఘం కమిటీ.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బండారి లక్ష్మారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక సేవా, సామజిక కార్యక్రమాలు చేపడుతున్న BLR గారికే తమ పూర్తి మద్దతు అని రాష్ట్ర వంశ రాజులు అందరూ కారు గుర్తుకు ఓటు వేసి ఉప్పల్ ఎమ్మెల్యే గా బండారి లక్ష్మారెడ్డి ని గెలిపించాలని అని వారు అన్నారు.

ఈ కార్యక్రమంలో వంశీ రాజు మల్లేశ్, అఖిల భారత వంశ రాజ్ అన్నదాన సత్రం చేర్మేన్ వంశ రాజు, అఖిల భారత వంశ రాజ సంఘం అధ్యక్షుడు పల్లె సత్యం,రాష్ట్ర అధ్యక్షుడు మురళీ కృష్ణ ,ప్రధాన కార్యదర్శి పాండు, గోపాల్, శ్రీ రాములు, యాదగిరి, పోశయ్య,మల్లేశ్, ముత్తు,సుమతి,రాము ,స్వామి తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Image 2023 09 21 at 10.07.43 AM

SAKSHITHA NEWS