SAKSHITHA NEWS

పెండ్యాల గ్రామంలో “గడపగడపకు -మన ప్రభుత్వం కార్యక్రమం”లో భాగంగా సంక్షేమ పథకాలను వివరిస్తున్న MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు ..

మైనారిటీ వర్గాలకు రాజకీయ సాధికారత కల్పించిన ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి : MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు ..

చంద్రబాబు ఓట్ల కోసం ముస్లింలను వాడుకున్నారు.. జగనన్న ప్రభుత్వం ముస్లింలకు రాజ్యాధికారం ఇచ్చింది : MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు ..

కంచికచర్ల మండలంలోని పెండ్యాల గ్రామంలో “గడపగడపకు -మన ప్రభుత్వం” కార్యక్రమంలో బుధవారం ఉదయం ప్రతి గడపకు వెళ్లి ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ – ప్రజల సమస్యలను శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు అడిగి తెలుసుకున్నారు ..

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ముస్లింల అభ్యున్నతి కోసం నాడు మహానేత వై.యస్‌.రాజశేఖర్‌రెడ్డి నాలుగు శాతం రిజర్వేషన్‌ కల్పిస్తే, నేడు ఆయన తనయుడు వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అడుగు ముందుకేసి పఠాన్‌, సయ్యద్‌, షేక్, మహమ్మద్ లకు సంక్షేమ పథకాలదించి బాసటగా నిలిచారని కొనియాడారు. గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు మైనారిటీలకు మంత్రి పదవి ఇవ్వడానికి కూడా మనసు రాని పరిస్థితి.. ఏకంగా ఉప ముఖ్యమంత్రి పదవిలో ఒక మైనారిటీ సోదరుడు ఉన్నారని.. మార్పు మీరే గమనించాలని కోరారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి నలుగురు మైనారిటీలను ఎమ్మెల్యేలుగా గెలిచారని, జగనన్న ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరో నలుగురిని ఎమ్మెల్సీలుగా నియమించారని గుర్తు చేశారు. టీడీపీ హయాంలో 2014–19 వరకు ఐదేళ్లలో మైనారిటీల సంక్షేమం కోసం చేసిన ఖర్చు కేవలం రూ.2,665 కోట్లేనని… జగనన్న ప్రభుత్వంలో ఏకంగా రూ.20 వేల కోట్ల లబ్ధి అందించిందని.. అప్పటికి, ఇప్పటికి ఎంత తేడా ఉందో గమనించాలని కోరారు. రాష్ట్రంలో 2019 నుంచి మైనార్టీలకు సువర్ణ అధ్యాయమని.. రాష్ట్రంలో ఇమామ్‌లు, మౌజమ్‌లకు ఇచ్చే గౌరవ భృతిని గత ప్రభుత్వం పక్కనపెడితే, జగన్‌ ప్రభుత్వం ఆ బకాయిలు చెల్లించడమే కాకుండా పెంచిన గౌరవ భృతిని చెల్లిస్తోందని చెప్పారు. ఇది మైనారిటీ వర్గాలకు రాజకీయ సాధికారత కల్పించిన ప్రభుత్వమన్నారు ..

ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు ,తదితరులు పాల్గొన్నారు ..

Whatsapp Image 2024 01 31 At 10.26.01 Am

SAKSHITHA NEWS