సాక్షిత ; సర్వేపల్లి నియోజకవర్గం, తోటపల్లి గూడూరు మండలం, పోట్లపూడి సచివాలయ పరిధిలో “గడప గడపకు మన ప్రభుత్వం” కార్యక్రమాన్ని ప్రారంభించి, విలుకానిపల్లి, గాంధీనగర్, లక్ష్మీపురం గ్రామాలలో పర్యటించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మరియు సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖా మాత్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి .
1 కోటి 50 లక్షలతో నిర్మించిన పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన మంత్రి కాకాణి.
విలుకానిపల్లి గ్రామంలో 92.50 లక్షల రూపాయలతో నిర్మించిన సిమెంటు రోడ్లను, నెల్లూరు-కోడూరు రోడ్డు నుండి విలుకానిపల్లి మీదుగా పోట్లపూడి వరకు 60 లక్షల రూపాయలతో నిర్మించిన తారురోడ్డును ప్రారంభించిన మంత్రి కాకాణి.
నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో పర్యటించి, ప్రతి కుటుంబాన్ని పలకరించి, అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ సంక్షేమ కార్యక్రమాలు అమలు తీరు పరిశీలించడంతో పాటు, ప్రజలు కోరుకుంటున్న అభివృద్ధి కార్యక్రమాలను పూర్తి చేయడమే లక్ష్యంగా గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహిస్తున్నాం.
సుదీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న అనేక సమస్యలను గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పరిష్కరిస్తున్నాం.
సర్వేపల్లి నియోజకవర్గంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ఇప్పటికే 2మండలాల్లో పూర్తి చేసి, తోటపల్లి గూడూరు మండలంలో పూర్తి చేస్తున్నాం.
గత ప్రభుత్వంలో మాదిరిగా జన్మభూమి కమిటీల సిఫార్సులు లేకుండా, అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి సంక్షేమ కార్యక్రమాలు అందుతున్నాయి.
గత ప్రభుత్వంలో మాదిరిగా శంఖుస్థాపన శిలాఫలకాలు కాకుండా, ప్రారంభోత్సవ శిలాఫలకాలతో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టి, ప్రజలకు అభివృద్ధిని అందిస్తున్నాం.
గ్రామాలలో కోట్ల రూపాయలు వెచ్చించి, ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు పూర్తి చేసి, ప్రారంభిస్తున్నాం.
గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు.