Online Applications for Gurukula (Boys)/ College Admission Seats
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణంలోని గల తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన మైనార్టీ గురుకుల (బాలుర) మరియు కళాశాలలో ప్రవేశ సీట్ల కొరకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని ప్రిన్సిపాల్ కామిశెట్టి కుమారస్వామి పిలుపునిచ్చారు
తెలంగాణ ప్రభుత్వం నిర్మించ డం, కేజీ టు పిజి లో భాగంగా హుజురాబాద్ లో గల తెలంగాణ మైనారిటీ గురుకుల కళాశాల మరియు పాఠశాల, హుజురాబాద్ (బాలుర) – లో 2023 -24 విద్య సంవత్సరానికి గాను 5, 6 ,7, 8 వ తరగతి, ఇంటర్మీడియట్ ఎంపీసీ,బిపిసి గ్రూపులో ప్రవేశం పొందడానికి అర్హత గల విద్యార్థులు ఈ నెల 15 వ తేదీ నుండి ౩౦ వ తేదీ లోపు ఆన్ లైన్ లేదా ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు నేరుగా మా పాఠశాల లోని మైనారిటీ గురుకుల పాఠశాలలో సంప్రదించండి 5వ తరగతిలో మైనారిటీ విద్యార్థులకు 30 సీట్లు , బీసీ -5, ఎస్సి – 2, ఎస్టీ -2 ఓసి -1 మొత్తం కలిపి 40 సీట్లు కలవు అలాగే ఇంటర్మీడియేట్ ఒక్కక గ్రూపులో మైనారిటీ విద్యార్థులకు 30 సీట్లు బీసీ -5, ఎస్సి – 2, ఎస్టీ -2, ఓసి -1 మొత్తం కలిపి 40 సీట్లు కలవని తెలిపారు. 6 ,7, 8 వ తరగతులలో కేవలం ముస్లిం మైనారిటీలు బ్యాక్ లాగ్ సీట్లు ఖాళీగా ఉన్నాయి . గ్రామీణ ప్రాంత విద్యార్థులు తల్లిదండ్రుల ఆదాయం రూ 150000, హుజురాబాద్ చుట్టుపక్కల మరియు జమ్మికుంట చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు మరియు విద్యార్థి తల్లిదండ్రులు వినియోగించుకోవాలని సూచించారు పట్టణ ప్రాంత విద్యార్థులు తల్లిదండ్రుల ఆదాయం రూ 2 లక్షల లోపు ఉండాలి . మా పాఠశాల లో అనుభవం కలిగిన అధ్యాపకులచే పూర్తిగా ఇంగ్లీష్ మీడియం విద్యాబోధన మరియు నాణ్యమైన భోజన వసతి కలదు.