SAKSHITHA NEWS

WhatsApp Image 2023 07 29 at 6.12.38 PM

కృష్ణ నది తీర ప్రాంత గ్రామల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

——- జిల్లా ఎస్పీ శ్రీమతి కె. సృజన

నదీతీర గ్రామలలో, పర్యాటక ప్రదేశాలలో పోలీస్ శాఖను అప్రమత్తంగా ఉండాలని ఆదేశించిన జిల్లా ఎస్పీ

గద్వాల్: అధిక వర్షాల కారణంగా పై నుండి కృష్ణ నదికి భారీగా వరద వస్తున్నందున జిల్లా లోని నది తీరా గ్రామల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, ఇప్పటికే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోలీస్ సిబ్బందినీ నది తీరా ప్రాంతంలో అందుబాటులో ఉంచినట్లు జిల్లా ఎస్పీ శ్రీమతి కె.సృజన తెలిపారు.

ఈరోజు జిల్లా ఎస్పీ పోలీస్ అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి కృష్ణ నదికి పై నుండి లక్ష 90 వేల క్యూ సెక్ ల వరద వస్తున్నందున పోలీస్ శాఖ పరంగా చేపట్టవలసిన చర్యల గురించి పోలీస్ అధికారులకు పలు ఆదేశాలు జారీచేశారు.

ఎగువ ప్రాంతం కర్ణాటక రాష్ట్రం లో కూడా భారీ వర్షాలు కురుస్తునందున కృష్ణ నది ఉదృతంగా ప్రవహిస్తుంది అని,
నది పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఎప్పటికప్పుడు వాగులు నదులు ఉదృతిని అంచనా వేస్తూ నది తీరా వ్యవసాయ పొలాలలో అన్న రైతులను, గొర్రెలు , పశువుల కాపరులను అప్రమత్తం చేయాలనీ అన్నారు. అలాగె వరద ముంపుకు గురయ్యే అవకాశం ఉన్న గ్రామాలలో టామ్ టామ్ వేయించి ప్రజలను అప్రమత్తం చేయాలని, నది ప్రవహక ప్రాంతాలలో ప్రధాన పుష్కర ఘాట్లు అయిన బీచూపల్లి, జూరాల డ్యా ఘాట్, గుంది మల్ల లోని పుష్కర ఘాట్ లలో పర్యాటకులు నదిలోకి వెళ్లకుండా హెచ్చరిక బోర్డు లు/ ప్లేక్సీలు ఏర్పాటు చేయించాలని, ప్రధాన రోడ్ల పై వరద ఉద్ధృతి ఎక్కువ ఉన్న ప్రదేశాలలో ప్రమాదాలు జరగకుండా ముందు జాగ్రత్తగా ట్రాఫిక్ డైవర్షన్ చేయాలని ఎస్పీ పోలీసు అధికారులను, సిబ్బందిని ఆదేశించారు. బ్లూ కోల్ట్స్ సిబ్బందితో 24 గంటలు నది తీరా గ్రామాల్లో గస్తీ ఏర్పాటు చేయాలనీ అధికారులను ఎస్పీ అదేశించారు.

పోలీస్ అధికారులు నది తీరా గ్రామాల సర్పంచులు మరియు ప్రజా ప్రతినిధులతో ఎప్పటికప్పుడు వరద ఉధృతి గురించి అడిగి తెలుసుకొని ప్రమాద నివారణ చర్యలను చేపట్టడానికి సిద్దంగా వుండాలని సూచించారు.
ఆనందం ను విషాదం చేసుకోవద్దు

సెలవు రోజులలో, సాధారణ రోజులలో జిల్లా లోని జూరాల డ్యాం, బిచూపల్లి వంటి పర్యాటక ప్రదేశాలకు వచ్చే వారు వరదల సమయం లో చాలా అప్రమత్తంగా ఉండాలని, అక్కడి పోలీస్ వారి సూచనలను తప్పకుండా పాటించాలని, సెల్ఫీ ల మోజులో పడి, అజాగ్రత్తగా వెళ్లి సంతోషంగా ఉండే తమ కుటుంబాలను విషాదం చేసుకోవద్దని, ముఖ్యంగా యువత ఈ విషయంలో అజాగ్రత్తగా ఉండొద్దని ఎస్పీ సూచించారు.

నది తీరా గ్రామల ప్రజలకు ఏమైనా ఇబ్బందులు తలెత్తిన డయల్ 100 కి కాల్ చేయాలని తెలిపారు. జిల్లాలో శాంతి భద్రతలను కాపాడుతూ, జిల్లా ప్రజల సంక్షేమం లో కూడా పోలీస్ అధికారులు ఎల్లపుడూ ముందు వరసలో ఉంటారని జిల్లా ఎస్పీ తెల్పడం జరిగింది.

జిల్లా పోలీస్ కార్యాలయం
జోగుళాoబ గద్వాల్ జిల్లా
.


SAKSHITHA NEWS