124 డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ డివిజన్ పరిధిలోని ఎల్లమ్మబండ ప్రధాన రహదారిలో నిన్నటి నుండి కురుస్తున్న వర్షం కారణంగా రోడ్డు పై ప్రవహిస్తున్న వర్షపు నీటిని గమనించి వాహనదారులకు ఇబ్బంది కలగకుండా సంబంధిత అధికారులను అదేశించి వర్షపు నీటిని వెంటనే క్లియర్ చేయించడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ డివిజన్ పరిధిలో వర్షపు ఎక్కడ నిలిచిన వెంటనే తొలగించే ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. అలాగే వర్షాకాలం కారణంగా డివిజన్ ప్రజలందరు వారి ఇండ్లను మరియు పరిసరాలను శుభ్రంగా ఉంచుకుని అనారోగ్యాల బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. కరెంట్ స్తంభాలను తాకకుండా ఉండాలని, ముఖ్యంగా చిన్నపిల్లలు కరెంట్ స్తంబాల వద్దకు పోకుండా తల్లితండ్రులు జాగ్రత్త వహించాలి సూచించారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు సమ్మారెడ్డి, సాయి గౌడ్, పద్మయ్య, రాజన్న, వర్క్ ఇస్పెక్టర్ రవి కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఎల్లమ్మబండ ప్రధాన రహదారిలో నిన్నటి నుండి కురుస్తున్న వర్షం కారణంగా రోడ్డు పై ప్రవహిస్తున్న వర్షo
Related Posts
దివంగత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి
SAKSHITHA NEWS దివంగత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైయస్సార్ విగ్రహ దిమ్మె కూల్చివేతపై టీపీసీసీ ప్రతినిధి జక్కిడి ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం… ఎల్. బి నగర్ : కామినేని చౌరస్తా వద్ద ఉన్న వైయస్సార్ విగ్రహ దిమ్మెని అభివృద్ధి పేరిట…
128 చింతల్ డివిజన్ పరిధిలోని హెచ్ఎంటి కాలనీలో, హజ్రత్ జిందాషా మాదర్ దర్గా
SAKSHITHA NEWS 128 చింతల్ డివిజన్ పరిధిలోని హెచ్ఎంటి కాలనీలో, హజ్రత్ జిందాషా మాదర్ దర్గా కమిటీ వారు నిర్వహిస్తున్న హజరత్ జిందాషా మాదర్ రహమతుల్లా ఆలే ఉర్సు ఉత్సవాలలో భాగంగా, గాంధీనగర్లో మొహమ్మద్ రియాజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సందల్ ముబారక్…