SAKSHITHA NEWS

తెలంగాణ రాష్ట్రంలోని సంక్షేమ హాస్టళ్ల లో అధికారుల సోదాలు

హైదరాబాద్:
తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లోని ప్రభుత్వ హాస్టళ్లలో ఏసీబీ దాడులు నిర్వహిస్తున్నారు.

హైదరాబాద్‌లోని బీసీ, ఎస్సీ, మైనార్టీ సంక్షేమ వసతి గృహాల్లో తెల్లవారుజాము నుంచి అధికారులు తనిఖీలు చేస్తున్నారు.

హాస్టళ్లలో ఆహారం సహా సౌకర్యాలు తదితర విష యాలపై ఆకస్మిక సోదాలు చేస్తున్నారు.ఇక నిజామా బాద్‌ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ షెడ్యూల్ కులాల బాలికల వసతి గృహంలో తెల్లవారు జాము నుంచి ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.

వసతి గృహంలో విద్యా ర్థులకు అందుతున్న ప్రభుత్వ ప్రయోజనాల తీరును పరిశీలిస్తున్నారు. కొంత కాలంగా ప్రభుత్వ వసతి గృహాల్లో నాణ్యమైన భోజనం పెట్టడం లేదన్న ఫిర్యాదుల మీద దాడులు చేస్తున్నట్లు సమాచారం.

రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ హాస్టళ్లలో కుల్లిన పదార్థా లతో ఆహారం వండుతున్నా రని ఆరోపణలు వస్తున్నా యి. అదేవిధంగా గతకొన్ని రోజులుగా వసతి గృహాల్లోని విద్యార్థులు తరచూ అనారో గ్యానికి గురవుతున్నారు.

జగిత్యాల జిల్లా మెట్‌పల్లి లోని బాలుర గురుకుల పాఠశాలలో ఓ విద్యార్థి తీవ్ర కడుపునొప్పితో చనిపోయి న విషయం కూడా తేలి సిందే. ఈ నేపథ్యంలో ఏసీబీ అధికారులు ప్రభుత్వ హాస్టళ్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నారు..

WhatsApp Image 2024 08 13 at 10.08.07

SAKSHITHA NEWS