SAKSHITHA NEWS

ప్రజలకు సౌకర్యంగా ఫోన్ సిగ్నల్స్ సామర్థ్యం పెరిగేలా అధికారులు కృషి చేయాలి
-సమస్యలను తెలిపితే.. బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ అభివృద్ధికి కేంద్రం వద్ద నా వంతు కృషి చేస్తా
-కొత్త టవర్ లను ఏర్పాటు చేసే ప్రణాళికలతో ముందుకు సాగండి
-ప్రైవేట్ సంస్థలతో పోటీ పడి బిఎస్ఎన్ఎల్ ను ముందుకు తీసుకువెళ్ళాలి

  • 4జి సేవలను మరింతగా పెంచాలి

-టెలికాం అడ్వైసరీ కమిటీ మీటింగ్ లో అధికారులకి నరసరావుపేట ఎంపీ శ్రీ కృష్ణదేవరాయలు దిశా నిర్దేశం

సమస్యలను పరిష్కారం చేసుకుని బిఎస్ఎన్ఎల్ ను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుని వెళ్లే ప్రణాళికలతో అధికారులు కృషి చేయాలని నరసరావుపేట ఎంపీ లావు శ్రీ కృష్ణ దేవరాయలు దిశా నిర్దేశం చేశారు. మరిన్ని బిఎస్ఎన్ఎల్ సిగ్నల్ టవర్ లు పెంచి నెట్వర్క్ సామర్థ్యాన్ని పెంచాలని సూచించారు. పల్నాడులో సిగ్నల్స్ పెరిగేలా మరింత దృష్టి సారించాలన్నారు. శనివారం గుంటూరు, చంద్రమౌళి నగర్ లోని బిఎస్ ఎన్ఎల్ కార్యాలయంలో జరిగిన.. గుంటూరు జిల్లా 3వ టెలిఫోన్ అడ్వైసరీ కమిటి సమావేశం లో ఎంపీ శ్రీ కృష్ణ దేవరాయలు పాల్గొన్నారు. సిగ్నల్ సామర్థ్యం పెంచితేనే ప్రజలకు ఈ నెట్వర్క్ పై నమ్మకం కలుగుతుందన్నారు.

సమస్యలు తెలిపితే కేంద్రం వద్ద తన వంతు కృషి చేస్తానని ఎంపీ పేర్కొన్నారు. గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఉన్న 729 టవర్ లలో 104 మాత్రమే 4జి సర్వీస్ గా ఉండటం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. అన్ని టవర్ లు 4జి గా మారేలా చూడాలని, అదనపు టవర్ లు ఏర్పాటు ప్రణాళికలు అందించాలన్నారు. కేంద్రం బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ అభివృద్ధికి దేశ వ్యాప్తంగా రూ. 89,000కోట్లని మంజూరు చేసి ప్రోత్సాహం ఇస్తుంటే.. అధికారులు ఎందుకు అభివృద్ధి బాటలో ఉండటం లేదని ప్రశ్నించారు. మహరాష్ట్ర వంటి రాష్ట్రాల్లో ఎక్కువగా నిధులు వాడుకొని బిఎస్ఎన్ ఎల్ ను అభివృద్ధి చేసుకుంటుటే మన రాష్టాల్లో వెనుకబాటు లోనే ఉంటున్నాం అని ప్రశ్నించారు. గ్రామాల్లో ఇళ్ల మధ్య టవర్ పెట్టడం ఇబ్బందిగా ఉంటే.. ప్రభుత్వ బిల్డింగ్లు గ్రామ సచివాలయాలు, ఆర్బికె లు, పిహెచ్ సి, స్కూల్స్ బిల్డింగ్ ల పైన పెట్టాలని సూచించారు. అత్యంత త్వరగా అభివృద్ధి ప్రణాళిక పత్రాలను తనకి అందించాలని అధికారులని ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో బిఎస్ ఎన్ఎల్ గుంటూరు జనరల్ మేనేజర్ శ్రీధర్, టెలికం అడ్వైసరీ కమిటీ మెంబెర్స్ కోటేశ్వరరావు, రవీంద్ర రెడ్డి, ఉదయభాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Image 2023 12 30 at 3.16.24 PM

SAKSHITHA NEWS