SAKSHITHA NEWS

Officials are not good with my daughter: Mallareddy’s son-in-law

నా కూతురితో అధికారుల తీరు బాగోలేదు: మల్లారెడ్డి అల్లుడు

Hyderabad : మంత్రి మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్ రెడ్డి ఐటీ సోదాల సమయంలో టర్కీలో ఉన్నారు. అయితే నేడు ఆయన టర్కీ నుంచి తిరిగొచ్చారు.ఈ సందర్భంగా అధికారుల తీరుపై విమర్శలు గుప్పించారు.

ఐటీ అధికారులు తన కూతురు, తల్లిదండ్రులతో అమానుషంగా ప్రవర్తించారన్నారు. తాను టర్కీ నుంచి వచ్చిన తరువాత కూతురితో మాట్లాడినట్టు వెల్లడించారు. ఇంట్లో ఉన్న అమ్మాయితో అధికారులు ప్రవర్తించిన తీరు సరిగ్గా లేదన్నారు.

ఈడీ, ఐటీ, సీబీఐతో దాడులు చేయించి తమను భయాందోళనకు గురి చేస్తున్నారన్నారు. తన ఇంట్లో సోదాలు నిర్వహించిన ఐటీ అధికారులు 4 కోట్ల రూపాయల నగదును సీజ్ చేశారని రాజశేఖరరెడ్డి వెల్లడించారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. మా తల్లిదండ్రులు, కూతురుపై ఐటీ అధికారులు ప్రవర్తించిన తీరుపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తాం.

మేము ప్రతి ఏడాది మేము ఐటీ రిటర్న్స్ చెల్లిస్తున్నాం. ఐటీ అధికారులు దాడులు చేసుకోవచ్చు, కానీ ఒక పద్ధతి ఉండాలి. ఇప్పటకే మూడు సార్లు సోదాలు చేశారు. కానీ ఎప్పుడు కూడా ఇలా ఐటీ అధికారులు అమానుషంగా ప్రవర్తించ లేదు. బీజేపీలో చేరాలని పరోక్షంగా మాపై ఐటీ దాడులు చేయిస్తున్నారు. మేము ఐటీ విచారణకు సహకరిస్తాం” అని వెల్లడించారు.


SAKSHITHA NEWS