అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటల పరిశీలన..
ప్రభుత్వం నుంచి పరిహారం అందుతుందని భరోసా
మంత్రి సత్యవతి రాథోడ్
సాక్షిత : అకాల వర్షాలకు పంటలు దెబ్బతిన్న రైతులు ధైర్యంగా ఉండాలని *రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ * అన్నారు. ములుగు జిల్లా రంగాపూర్ లో ఇటీవల కురిసిన అకాల వర్షాలకు దెబ్బతిన్న మామిడి తోటను మంత్రి పరిశీలించి రైతులకు ధైర్యం చెప్పారు. రైతులు కష్టపడి సాగు చేసిన పంటలు అకాల వర్షంతో దెబ్బతినడం బాధాకరమన్నారు. అధికారులు గ్రామాల్లో పర్యటించి పంట నష్టం వివరాలు సేకరిస్తున్నారని తెలిపారు. పంటలు నష్టపోయిన రైతులకు ప్రభుత్వం నుంచి పరిహారం అందుతుందని మంత్రి స్పష్టం చేశారు.
అనంతరం…
ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం దుంపెల్లిగూడెంలో 75 లక్ష్యం అంచనా వ్యయంతో పాపయ్యపల్లి ఆర్ అండ్ బి నుండి దుంపెల్లి గూడెం వరకు బి.టి రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ .
అనంతరం గోవిందరావుపేట మండలం ఫ్రూట్ ఫారమ్ గ్రామంలో 90 లక్షల అంచనా వ్యయంతో NH-163 రోడ్ గోవిందరావుపేట నుండి బిటి రోడ్ నిర్మణ పనులకు మంత్రి సత్యవతి రాథోడ్ శంకుస్థాపన చేశారు.