SAKSHITHA NEWS

హైదరాబాద్‌: పటాన్‌చెరు శివారులో బాహ్యవలయ రహదారిపై కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే లాస్య నందిత కారు ప్రమాదం కేసు దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు. ఎందుకు జరిగింది? ఎలా జరిగింది?అనే దానిపై వివరాలు సేకరిస్తున్నారు.
ముందు వెళ్తోన్న వాహనాన్ని ఢీకొట్టడంతో ఓఆర్‌ఆర్‌పై రెండో లైనులో వెళ్తోన్న వాహనం చివరకు రెయిలింగ్‌ను ఢీకొని ఆగిపోయినట్లు గుర్తించారు

. ప్రమాద స్థలం నుంచి దాదాపు 500మీటర్ల దూరంలో కారు స్పేర్‌పార్టు, కారుపై రాక్‌శాండ్‌ పౌడర్‌ పడి ఉండటంతో టిప్పర్‌ లేదా రెడిమిక్స్‌ వాహనాన్ని ఢీకొట్టి ఉంటుందని నిర్ధరణకు వచ్చారు. ప్రమాద సమయంలో ఓఆర్‌ఆర్‌పై వెళ్లిన ఆరు టిప్పర్‌ల వివరాలను గుర్తించారు. అయితే, ఘటన జరిగినప్పుడు ఎమ్మెల్యే కారు డ్రైవర్‌ ఆకాశ్‌ మద్యం తాగి ఉన్నాడా? లేదా? అనే వివరాల నిర్ధరణ కోసం అతని రక్త నమూనాలను పరీక్షల కోసం పంపారు. ముత్తంగి బాహ్యవలయ రహదారి దాటుతున్న సమయాలను తెలుసుకొన్నారు. ఆకాశ్‌ చరవాణి వివరాలు కూడా పరిశీలిస్తున్నామని పోలీసులు తెలిపారు. ఇప్పటికే మేజిస్ట్రేట్ ఎదుట డ్రైవర్‌ వాంగ్మూలం తీసుకున్నారు. హై ప్రొఫైల్ కేసుకావడంతో సంబంధిత శాఖలోని నిపుణులతో దర్యాప్తు చేస్తున్నారు. 

WhatsApp Image 2024 02 24 at 6.17.13 PM

SAKSHITHA NEWS