SAKSHITHA NEWS

డాక్టర్ ధర్మవత్ ప్రీతి మరణానికి ప్రభుత్వం బాధ్యత వహించాలని ఎన్.ఎస్.యు.ఐ నియోజకవర్గ నాయకులు బొంగోని ప్రశాంత్ డిమాండ్ చేశారు

కరీంనగర్ జిల్లా
వీణవంక మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో బొంగోని ప్రశాంత్ మాట్లాడుతూ అట్టడుగున గ్రామీణ ప్రాంతాల నుండి ఉన్నత చదువుల కొరకు శ్రమించి డాక్టర్ అయినందుకు మానసికంగా అనేకమార్లు వేధించడం విషయాలను ఉన్నత మెడికల్ ఆఫీసర్స్ కి చెప్పినప్పటికీ సైకో సైఫ్ పై ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఉన్నత వర్గాలకు ఒక న్యాయం గిరిజనులకు ఇంకో న్యాయమా? ఇలాంటి మూర్ఖుల వలన సభ్య సమాజం తలదించుకునే లాగా వ్యవహరించిన తీరు సోషల్ మీడియాలో వచ్చినప్పటికీ సరైన సమయంలో స్పందించకపోవడం దుర్మార్గమైన చర్య. అట్టడుగున దళితుల గిరిజనులు అమ్మాయిలపై ఉన్నత చదువులకు మహానగరంలో వచ్చిన వారితో ఇలాంటి సంఘటనలు జరగడం చాలా దురదృష్టకరమన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే కఠినమైన చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఒకవేళ చర్యలు తీసుకొని యెడల ఎన్.ఎస్.యు.ఐ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సాయి, శివ,శ్రావణ్,కిరణ్ తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS