UPI పేమెంట్స్ ఛార్జీలపై NPCI క్లారిటీ
ఏప్రిల్ 1 నుంచి.. ఆన్లైన్ వాలెట్లు, ప్రీ-లోడెడ్ గిఫ్ట్ కార్డుల వంటి ‘ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్స్ట్రుమెంట్స్ (PPI)’ ద్వారా చేసే యూపీఐ మర్చంట్ లావాదేవీలపై మాత్రమే అదనపు ఛార్జీలను విధించనున్నట్లు ‘నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా’ (NPCI) వెల్లడించింది. పీపీఐ ద్వారా ₹2,000 కంటే ఎక్కువ యూపీఐ లావాదేవీ జరిపితే 1.1 శాతం ఇంటర్ఛేంజ్ ఛార్జీ చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది.
అయితే ఒక వ్యక్తి బ్యాంక్ అకౌంట్ నుంచి మరో బ్యాంక్ అకౌంట్కు, వినియోగదారుల నుంచి వ్యాపారుల మధ్య జరిగే యూపీఐ లావాదేవీలపై ఎలాంటి అదనపు రుసుము ఉండదని స్పష్టం చేసింది. అంటే సామాన్య ప్రజలు రోజువారీ చెల్లింపుల కోసం యూపీఐ యాప్లను వినియోగిస్తే ఎలాంటి అదనపు రుసుము వర్తించదు.