ప్రగతి నగర్ జిల్లా పరిషత్ ఉన్నత, ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థులకు నోట్ బుక్స్, గడియారం & గొడుగులను పంపిణీ చేసిన కేకేఎం చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కూన శ్రీనివాస్ గౌడ్ ..
విద్యార్థులు జన్మనిచ్చిన తల్లిదండ్రులను, విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులను ఎన్నటికీ మరవద్దు..
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం; నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి, ప్రగతి నగర్ జిల్లా పరిషత్తు ఉన్నత, ప్రాథమిక పాఠశాలల్లోని విద్యార్థులకు కేకేఎం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ట్రస్ట్ చైర్మన్ కూన శ్రీనివాస్ గౌడ్ రాత పుస్తకాలు, గడియారం, గొడుగులతో కూడిన కిట్లను అందజేశారు.
ఈ సందర్బంగా కూన శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ…. జన్మనిచ్చిన తల్లిదండ్రులు, విద్యా బుద్దులు నేర్పిన ఉపాధ్యాయులను ఎప్పటికీ మరవద్దన్నారు. మీ తల్లిదండ్రులు కన్న కలలను సాకారం చేయాలని, గొప్ప లక్ష్యాలు ఉంటె గొప్ప వారు అవుతారని అన్నారు. పేద కుటుంబంలో పుట్టి ప్రభుత్వ బడుల్లో చదివి ఎంతో మంది గొప్పవారు అయ్యారని.. తన సోదరుడు కూన శ్రీశైలం గౌడ్ ప్రభుత్వ పాఠశాలలోని చదివి కుత్బుల్లాపూర్ నియోజక వర్గానికి మొట్టమొదటి ఎమ్మెల్యే అయ్యాడని ఆయన ఆదర్శంగా తీసుకొని ప్రతి విద్యార్థి జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకోవాలని ఆకాంక్షించారు
ఈ కార్యక్రమంలో నాయకులు కొల్లి మాధవి, బుచ్చిరెడ్డి, ఆకుల సతీష్, డా.రాజు, దాసి నాగరాజు, ప్రొఫెసర్ చంద్రమౌళి, రామ్ చందర్ నాయక్ అమలేశ్వరి, కొంకి రాము, సాయి కృష్ణారెడ్డి, సుహాసిని, ఈశ్వర్ రెడ్డి, అశోక్ నాయక్, తైనీసా, అఖిల ట్రస్ట్ వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.