No restrictions on immersions: Thalasani
నిమజ్జనాల విషయంలో ఎలాంటి ఆంక్షల్లేవు: తలసాని.
సాక్షిత హైదరాబాద్: గణేశ్ నిమజ్జనానికి ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసిందని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. నిమజ్జనాల విషయంలో ఎలాంటి ఆంక్షలు లేవని స్పష్టం చేశారు. భాజపా కావాలనే ప్రజల్లో గందరగోళం సృష్టిస్తోందని మండిపడ్డారు.
ఇవాళ ఖైరతాబాద్ మహాగణపతిని మంత్రి దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. దేశంలో ఎక్కడా ఇంత పెద్దగా వినాయక చవితి ఏర్పాట్లు చేయడం లేదన్నారు. ఈనెల 9వ తేదీన నిర్వహించే గణేశ్ నిమజ్జన ఏర్పాట్లు పకడ్బందీగా జరుగుతున్నాయని మంత్రి వెల్లడించారు.