SAKSHITHA NEWS

టిఎస్‌ బిపాస్‌ విధానం ద్వారా నిర్మాణ అనుమతులు మధ్యవర్తుల ప్రమేయం లేకుండా త్వరితగతిన ఆమోదించడం జరుగుచున్నదని జిల్లా కలెక్టర్‌ వి.పి. గౌతమ్‌ అన్నారు. నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో జిల్లా స్థాయి లే అవుట్‌ అప్రూవల్‌ కమిటీ సమావేశాన్ని నగరపాలక సంస్థ కమీషనర్ ఆదర్శ్ సురభితో కలిసి, కలెక్టర్ నిర్వహించారు.

ఈ సమావేశంలో ఖమ్మం నగరపాలక సంస్థ పరిధిలో ఒకటి, మధిర మునిసిపాలిటీ పరిధిలో ఒకటి, సత్తుపల్లి మునిసిపాలిటీ పరిధిలో 3, సుడా పరిధిలో (13), ఫైనల్‌ లే-అవుట్ల ఆమోదం కొరకై 3, మొత్తం (21) దరఖాస్తులను పరిశీలించారు. నిబంధనల మేరకు సమర్పించబడిన దరఖాస్తులను కమిటీ ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, లే-అవుట్ల అనుమతులను నిర్ణీత గడువులోగా, నిబంధనల మేరకు పూర్తి చేయాలని అన్నారు.

జిల్లాలో లే-అవుట్ల ఆమోదం కొరకు రెవెన్యూ, విద్యుత్‌, ఇర్రిగేషన్‌, రోడ్లు భవనాల, టౌన్‌ ప్లానింగ్‌ తదితర అనుబంధ శాఖల నుండి అనుమతులకై సమర్పించిన దరఖాస్తులను ఆయా శాఖలకు సంబంధించిన అధికారులు క్షేత్రస్థాయి స్థల పరిశీలన చేసిన మీదట 21 రోజుల లోపు అనుమతులను జారీచేయాలని, తదనుగుణంగా జిల్లా స్థాయి కమిటీ సమావేశంలో ఆమోదించడం జరుగుతుందని అన్నారు. గ్రీనరీ కొరకు కేటాయించిన స్థలాన్ని వెంటనే స్వాధీనపర్చుకొని మొక్కలు నాటాలన్నారు. లేఅవుట్‌ డెవలపర్స్‌ కూడా నిబంధనల మేరకు చట్టబద్దంగా సమగ్ర ప్రణాళికబద్దంగా ల్యాండ్‌ డెవలప్మెంట్‌ పనులు చేపట్టాలని ఈ సందర్భంగా కలెక్టర్‌ తెలిపారు.


ఈ సమావేశంలో ఆర్ అండ్ బి ఎస్ఇ శ్యామ్ ప్రసాద్, ఖమ్మం ఆర్డీవో జి. గణేష్‌, జెడ్పి సిఇఓ అప్పారావు, డిపిఓ హరికిషన్‌, ఏడి సర్వే అండ్‌ ల్యాండ్‌ రికార్డ్స్‌ శ్రీనివాసులు, డిటిసిపిఓ ప్రసాద్‌, టిపిఓ వికాస్‌, మధిర, కొనిజర్ల తహశీల్దార్లు వెంకటేశ్వర్లు, తఫజ్జుల్ హుస్సేన్, ఇర్రిగేషన్‌, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Image 2024 02 09 at 6.52.04 PM

SAKSHITHA NEWS