SAKSHITHA NEWS

టిడ్కో ఇళ్లపై బహిరంగ చర్చకు సిద్ధం.. సెల్ఫీలతో అవాస్తవాలు వద్దు

నెల్లూరులో చంద్రబాబు సెల్ఫీ దిగిన ఇళ్లు వైసీపీ ప్రభుత్వం వచ్చాక పూర్తిచేశాం అని మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. టిడ్కో ఇళ్లపై బహిరంగ చర్చకు మేము సిద్ధం అని స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షల 30 వేల టిడ్కో ఇళ్లను డిసెంబర్ నాటికి లబ్ధిదారులకు అందిస్తామని మంత్రి ప్రకటించారు. గత టిడిపి ప్రభుత్వం టిడ్కో ఇళ్లను అసంపూర్తిగా మధ్యలోనే వదిలేసిందని విమర్శించారు. తండ్రి, కొడుకులు టిడ్కో ఇళ్ళ సెల్ఫీలు దిగి అవాస్తవాలు చెబుతున్నారని మండిపడ్డారు. తాజ్ మహల్, చార్మినార్ ముందు చంద్రబాబు, లోకేష్‌లు సెల్ఫీలు తీసుకుని మేమే కట్టామని చెప్పుకుంటారని ఎద్దేవా చేశారు. పేదల సంక్షేమం కోసం పోరాడుతోంది ఒక జగన్‌ మాత్రమేనని చెప్పారు. రూపాయికే టిడ్కో ఇళ్లను పేదలకి అందిస్తున్న ఘనత సీఎం జగన్‌ది అని తెలి…


SAKSHITHA NEWS