SAKSHITHA NEWS

మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి అధ్యక్షతన కమీషనర్ రామకృష్ణ రావు ,ఎస్. ఈ సత్యనారాయణ తో కలిసి నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో NMC ఆయా విభాగాల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా కార్పొరేషన్ పరిధిలో పలు అభివృద్ధి పనులు ,పెండిగ్ లో ఉన్న పలు నిర్మాణ అభివృద్ధి పనులు,కావాల్సిన నిధులు,అవసరమైన మౌలిక సదుపాయాల గురించి చర్చా సమావేశం నిర్వహించడం జరిగింది.

భాగంగా మేయర్ మాట్లాడుతూ సమస్యల పరిష్కారానికి కృషి, పెండింగ్ దశలో ఉన్న పలు నిర్మాణ అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు.అదే విధంగా కార్పొరేషన్ పరిధిలో రోడ్లు,డ్రైనేజ్ లు,పార్క్ ల అభివృద్ధి,ట్రాఫిక్ ఇబ్బందులు నియంత్రణ,రోడ్ ప్యాచ్ వర్క్స్ ,విద్యుత్ తీగలకు అడ్డుగా పెరిగిన చెట్ల కొమ్మలు,వాటి తొలగింపు,లేక్ డెవలప్మెంట్,ఫుట్ పాత్ ల పై అక్రమ షాపులు,పండ్లు,మరియు ఇతర బండ్ల తొలగింపు,ఫాగింగ్,వీధి కుక్కల బెడద,ప్లాస్టిక్ కవర్ల నిషేదం తగు చర్యలు, ఇంటి పన్నుల బకాయిలు వాటి చెల్లింపు,వంటి విషయాలపై పరిపాలన,ఇంజినీరింగ్,టౌన్ ప్లానింగ్ ,శానిటేషన్,ఎలక్ట్రికల్, హార్టికల్చర్,ఆయా విభాగాల అధికారులతో చర్చించి సమీక్ష నిర్వహించారు.

అనంతరం 33 డివిజన్ల శానిటేషన్ సూపర్వైజర్లతో ప్రత్యేక సమావేశంలో మాట్లాడుతూ ఎల్లపుడూ ఆయా డివిజన్ల పరిధిలోని అపార్ట్మెంట్స్,విల్లాలు, కాలనీలు,బస్తీలు,ఇతర సముదాయాలు ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉండే దిశగా చర్యలు చేపట్టాలని,ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి ప్రాంతాలలో శుభ్రతకు సంభందించి నెలకొన్న సమస్యలు అధికారుల సమన్వయంతో కృషి చేయాలని,కార్మికులు తమ విధుల నిర్వహణ పట్ల అప్రమత్తత,వంటి పలు అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో NMC ఆయా విభాగాల అధికారులు,మరియు సిబ్బంది పాల్గొన్నారు.

WhatsApp Image 2024 02 20 at 2.05.11 PM

SAKSHITHA NEWS