SAKSHITHA NEWS

నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం సమావేశం హాల్ లో *మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి * అధ్యక్షతన,కమిషనర్ రామకృష్ణారావు ,ప్రజాప్రతినిధులు,అధికారులతో కలిసి *బడ్జెట్ సమావేశం 2024-25,మరియు సాధారణ సర్వ సభ్య సమావేశం


నిర్వహించారు. ఈ సందర్భంగా 2024-25 సంవత్సర అంచనా బడ్జెట్ మరియు 2023-24 సంవత్సర సవరణ బడ్జెట్ ను సభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది.ఈ సమావేశంలో ముఖ్యంగా నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ 2024-2025 బడ్జెట్ అంచనా 111.50 కోట్లు,దీనిలో భాగంగా పురపాలక సంఘం ఆదాయం నుండి జీతాలు,పొరుగుసేవల ఉద్యోగుల జీతాలు,పారిశుద్ధ్య నిర్వహణ,కరెంట్ బిల్లులు, ఋణ వాయిదాల చెల్లింపులు, మరియు 10 శాతం నిధులను(పురపాలక సంఘం సొంత ఆదాయ వనరులు,పట్టణ ప్రగతి నిధులు ,మరియు 15వ (యునైటెడ్) నిధులు ఆర్థిక సంఘం నిధుల నుండి) హరితహరం గ్రీన్ బడ్జెట్ పనులకు 10 కోట్ల,71లక్షల, 25 వేలు కేటాయించడం జరిగింది.1/3 వ వంతు బడ్జెట్ కొత్తగా విలీనమైన ప్రాంతాలలో క్లిష్టమైన మౌలిక సదుపాయాల అవసరాలు మరియు అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలు మరియు బలహీన వర్గాల, మైనార్టీలు, మరియు మురికివాడల్లో నివసించే ప్రాంతాలకు, 13 కోట్ల,29 లక్షల,58 వేలు కేటాయించడం జరిగింది.బడ్జెట్ కేటాంపులు 2024-25 శాతాల వారీగా వివరములు జీతం ఖర్చులు 14శాతం,పారిశుధ్యం ఖర్చులు 9శాతం,సీసీ ఛార్జీలు 2శాతం,రుణం తిరిగి చెల్లింపులు 4శాతం,గ్రీన్ బడ్జెట్ 10శాతం,ఇతర నిర్వహణలకు 22శాతం,బడ్జెట్ 1/3వ వంతు బ్యాలెన్స్ 13శాతం,ప్రజా సౌకర్యాలు 5శాతం,వార్డుల వారీగా పనులు 21శాతం, మున్సిపల్ జనరల్ పండ్స్ నుండి పలు అంశాలను ప్రస్తావించడం జరిగింది. దీనిలో భాగంగా రోడ్లు, డ్రైనేజ్,UGD,పార్క్ లు,మంజీర వాటర్ లైన్స్,సీసీ ప్యాచ్ వర్క్స్,డంప్ యార్డ్,అన్నపూర్ణ పథకం,వీధి దీపాలు,లేక్ డెవలప్మెంట్స్,పబ్లిక్ టాయిలెట్స్,కల్వర్ట్లు, వంటి పలు అంశాలను తీసుకోవడం జరిగింది.

అదే విధంగా ఇంజనీరింగ్,పరిపాలన,పట్టణ ప్రణాళిక,హార్టికల్చర్,పారిశుద్ధ్యం,ఆరోగ్య మరియు పారిశుద్ధ్యం,వంటి విభాగాలకు సంబంధించి ప్రతిపాదనలు,అదే విధంగా కార్పొరేషన్ 33 డివిజన్ల పరిధిలో ఆయా డివిజన్ల వారీగా చేపట్టిన అభివృద్ది పనులు,చేపట్టబోయే పలు నిర్మాణాభివృద్ధి పనులకు నిధులు,కావాల్సిన మౌళిక సదుపాయాలు, పెండింగ్ దశలో ఉన్న పనులు,వాటి పూర్తి,స్వచ్ఛ నిజాంపేట్ దిశగా చర్యలు,గృహ సముదాయాలు,కాలనీలు,బస్తీల్లో నెలకొన్న పలు సమస్యలు,వాటి పరిష్కారానికి కృషి,అదే విధంగా వీధి కుక్కల బెడద,ట్రాఫిక్ ఇబ్బందులు, దోమల ఫాగింగ్ తగు చర్యలు వంటి పలు కీలక ప్రధాన అంశాలపై ప్రజాప్రతినిధుల సలహాలు,సూచనలతో చర్చా సమావేశం నిర్వహించడం జరిగింది.

ఈ సమావేశంలో కార్పొరేటర్లు,కో ఆప్షన్ సభ్యులు,ఇంజనీరింగ్,శానిటేషన్,టౌన్ ప్లానింగ్, వాటర్ వర్క్స్,రెవిన్యూ,హార్టికల్చర్, ఎలక్ట్రికల్,ఇతర ముఖ్య విభాగాల సంబంధిత అధికారులు మరియు సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Image 2024 02 27 at 2.08.56 PM

SAKSHITHA NEWS