నిజాంపేట్ కార్పొరేషన్ పరిధి బాచుపల్లి లో జరిగిన చేరికల కార్యక్రమంలో టిడిపికి చెందిన మాజీ ఎంపిటిసి చంద్ర వెంకటేశ్వర్లు తో పాటు ఇతర టిడిపి నాయకులు ఎమ్మెల్యే కేపీ వివేకానంద సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ వివేకానంద మాట్లాడుతూ
గడిచిన తొమ్మిదేళ్ల కాలంలో నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని, రానున్న రోజుల్లో ముచ్చటగా మూడవసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడదామన్నారు. చేసిన అభివృద్ధిని, రాబోయే ఐదేళ్ల కాలంలో చేపట్టబోయే అభివృద్ధిని వివరించే మేనిఫెస్టోను ప్రజలకు వివరించి ముచ్చటగా మూడవసారి బిఆర్ఎస్ పార్టీ భారీ మెజార్టీతో హ్యాట్రిక్ విజయం సాధించేలా నాయకులు, కార్యకర్తలు పనిచేయాలన్నారు.
బిఆర్ఎస్ పార్టీలో చేరిన వారు : టిడిపి సీనియర్ నాయకులు రమేష్, కిషోర్, శ్రీహరి తదితరులు..
ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు రంగరాయ ప్రసాద్, నాయకులు గోపాల్ రెడ్డి, ఫ్లోర్ లీడర్ ఆగం రాజు, కార్పొరేటర్లు ఆగం పాండు, కాసాని సుధాకర్, గాజుల సుజాత, నాయకులు అనిల్ కురుటూరి తదితరులు పాల్గొన్నారు.