SAKSHITHA NEWS

నూతనంగా ఎన్నికైన మేడ్చల్ – మల్కాజ్గిరి జిల్లా వ్యవసాయ మరియు సహకార శాఖ మార్కెట్ యార్డ్ కమిటీ ఛైర్మన్ మరియు డైరెక్టర్లు టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి భూపతిరెడ్డి ని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.
ఈ సందర్భంగా నర్సారెడ్డి భూపతిరెడ్డి నూతన సభ్యులకు శుభాకాంక్షలు తెలియచేసి కాంగ్రెస్ ప్రజాప్రభుత్వంలో నిస్వార్ధంగా పనిచేసి మార్కెట్ అభ్యున్నతికి కృషి చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ *బొమ్మలపల్లి నర్సింహులు, డైరెక్టర్లు తున్కి బిక్షపతి, గాదె వినోద్, ఈగ శ్వేతా తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS