SAKSHITHA NEWS

సాక్షిత సూర్యపేట జిల్లా ప్రతినిధి : సూర్యాపేట జిల్లా కేంద్రంలో డీఎస్పీ కార్యాలయాన్ని ఐజి రమేష్ రెడ్డి ఐపీఎస్, IG సత్యనారాయణ ఐపీఎస్, జిల్లా కలెక్టర్ తేజస్ నందులాల్ పవార్ ఐఏఎస్, జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ ఐపిఎస్ లతో కలిసి ప్రారంభించిన రాష్ట్ర నీటి పారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వచ్చిన మంత్రికి జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ ఐపీఎస్ పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతం తెలిపారు. అదేవిధంగా పోలీస్ సిబ్బంది గౌరవ వందనం చేయడం జరిగినది. సూర్యాపేట జిల్లా కేంద్రం నందు నిర్మించిన సబ్ డివిజనల్ పోలీస్ కార్యాలయం డిఎస్పి ఆఫీసును, నివాస గృహాన్ని ఈరోజు రాష్ట్ర పౌరసరఫరాల, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి ప్రారంభించారు.

ఈ కార్యాలయాన్ని 70 లక్షల పోలీస్ హౌజింగ్ నిధులు, 20 లక్షల పంచాయితిరాజ్ శాఖా నిధుల నుండి నిర్మాంచారు. ఈ కార్యాలయాన్ని ప్రారంభించడం చాలా సంతోషకరమైన విషయమని మంత్రి పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పోలీస్ శాఖ క్రమశిక్షణ కలిగిన శాఖ అని వృత్తి నిర్వహణలో ఎంతోమందికి సేవలు చేయడంలో పోలీస్ వారు ముందుంటున్నారని కొనియాడారు. సమాజంలో శాంతిభద్రతల రక్షణలో పోలీసు సిబ్బంది పగలు రాత్రి తేడా లేకుండా 24 గంటలు శ్రమిస్తున్నారని రాష్ట్ర పోలీసు సిబ్బందికి అభినందనలు తెలియజేస్తున్నాను అన్నారు. దేశంలోనే తెలంగాణ పోలీసు ప్రథమ స్థానంలో ఉన్నదని అన్నారు. రాష్ట్రంలో పోలీస్ శాఖకు అవసరమైన మౌలిక సదుపాయాలని ఏర్పాటు చేయడంలో నిధులు మంజూరు చేయడానికి ముఖ్యమంత్రి తో మాట్లాడి కృషి చేస్తానని తెలిపారు. సూర్యాపేట జిల్లాలో నూతనంగా ఏర్పడ్డ పోలీస్ స్టేషన్లు అనంతగిరి, చింతలపాలెం, పాలకీడు, మద్దిరాల, నాగారం పోలీస్ స్టేషన్లకు నూతన భవనాలు నిర్మించడానికి నిధులు మంజూరు చేస్తామని ఆన్నారు.

రాష్ట్రంలో పోలీస్ భవనాల నిర్మాణానికి తెలంగాణ రాష్ట్ర పోలీసు హాజింగ్ సొసైటి కృషి చేస్తున్నది అని తెలిపినారు. పోలీస్ హౌసింగ్ సొసైటీ ఉత్తమంగా పనిచేయడానికి ఆర్థిక సదుపాయాలు కల్పించడానికి నిధులు ఇప్పిస్తామని తెలిపారు. సర్వమత ప్రార్థనలు నిర్వహించి నూతన కార్యాలయం నందు డీఎస్పీ రవిని కుర్చీలో కూర్చోబెట్టి పుష్పగుచ్చం ఇచ్చి అధికారులు శుభాకాంక్షలు తెలిపిపారు. ఈ కార్యక్రమం నందు తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్, మల్టీజోన్ 2 ఐజి సత్యనారాయణ ఐపీఎస్, పోలీస్ హౌసింగ్ ఐజి రమేష్ రెడ్డి ఐపీఎస్, జిల్లా కలెక్టర్ తేజస్ నందులాల్ పవార్ ఐఏఎస్, జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ ఐపిఎస్, అదనపు ఎస్పీ లు నాగేశ్వరరావు, జనార్ధన్ రెడ్డి, డీఎస్పీ లు రవి, శ్రీధర్ రెడ్డి, సూర్యాపేట పబ్లిక్ క్లబ్ ఛైర్మెన్ వేణారెడ్డి, సూర్యాపేట డివిజన్ సీఐ లు, ఎస్సై లు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.


SAKSHITHA NEWS