SAKSHITHA NEWS

WhatsApp Image 2023 08 28 at 2.15.40 PM

బీసీ సబ్బండ వర్గాల నేత నీలం మధు ముదిరాజ్ కు మద్దతుగా ఉండి గెలిపించుకు తీరుతామని బొల్లారం మున్సిపాలిటీ,నాల్తుర్ కి చెందిన సంఘం సభ్యులు తేల్చిచెప్పారు

మీ వెంటే మేం నడుస్తామని ఉద్గాటించారు

అన్ని కుల సంఘాలు ఏకతాటికి వచ్చి మద్దతు ప్రకటించే దిశగా కదలి రావాలని బొల్లారం,నల్తూరు సంఘాలు పిలుపునిచ్చాయి

పటాన్చెరువు నియోజవర్గం బొల్లారం మున్సిపాలిటీకి చెందిన మాజీ సర్పంచ్ మన్నె స్వామి ముదిరాజ్, నల్తూర్ గ్రామపంచాయతీ కొర్లకుంట ముదిరాజ్ సంఘల ఆధ్వర్యంలో ముదిరాజ్ సంఘ సభ్యులు అందరూ ఏకగ్రీవ తీర్మానం చేసి చిట్కుల్ గ్రామంలో నీలం మధు ముదిరాజ్ ను కలిసి సంపూర్ణ మద్దతు తెలుపుతూ ఏకగ్రీవ తీర్మానం చేసినట్లు తెలపడం జరిగింది. పార్టీలకతీతంగా ముదిరాజులందరూ, సబ్బండ వర్గాలు ఒకేతాటిపైకి వచ్చి గెలిపించుకుంటామని వారు తెలిపారు.

నీలం మధు ముదిరాజ్ ఏ పార్టీ నుంచి పోటీ చేసినా బీసీ సబ్బండ వర్గాల నేతగా పూర్తి మద్దతు అందజేసి గెలిపించి అసెంబ్లీకి పంపుతామని వారు తెలిపారు,నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న ముదిరాజ్ లు, అన్ని కుల సంఘాలు కూడా నీలం మధు ముదిరాజ్ కు పూర్తిస్థాయి మద్దతు గ్రామ గ్రామాన లభిస్తుందన్నారు, చిట్కుల్ గ్రామం నుంచి ప్రారంభమై నిన్న జిన్నారం, నేడు బొల్లారం మున్సిపాలిటీ, నల్తూర్ నుంచి బీసీ వర్గాలు ఏకగ్రీవ తీర్మానాలతో పూర్తిస్థాయి మద్దతు లభిస్తుందన్నారు.ఎక్కడికి వెళ్ళినా ప్రేమతో ఆప్యాయతతో పలకరించి మీ వెంటే ఉంటామని మిమ్మల్ని గెలిపించుకుంటామని చెబుతున్నామని వారు తెలిపారు.

ఇది ఒక గ్రామం మున్సిపాలిటీలకే పరిమితం కాకుండా జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా బీసీలకు న్యాయం జరిగే వరకూ ఏకగ్రీవ తీర్మానాలు చేసి మద్దతుగా నిలుస్తామని తెలిపారు, ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం అధ్యక్షులు మన్నె రాములు, తలారి కృష్ణ,రవీందర్,రమేష్, చెన్నయ్య, నారబోయిన శ్రీనివాస్, మహేష్,శ్రీశైలం, పర్వతాలు, గోపాల్, సత్తయ్య, నాగేష్,సుధాకర్,రాజు,నర్సింలు,స్వామి, నరసింహ,శ్రీనివాస్,వెంకటేశ్,సంఘం సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS