
జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా మచిలీపట్నంలో మహిళా పోలీసుల ప్రత్యేక బైక్ ర్యాలీ.
మచిలీపట్నం, జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా, హెల్మెట్ వినియోగాన్ని తప్పనిసరి చేయడంపై అవగాహన కల్పించేందుకు కృష్ణా జిల్లా పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. హైకోర్టు ఉత్తర్వుల మేరకు, జిల్లా ఎస్పీ ఆర్. గంగాధర రావు, ఐపీఎస్ ఆదేశాల మేరకు మచిలీపట్నం ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ఏ.వి. శివకుమార్ ఆధ్వర్యంలో మహిళా పోలీసులతో ప్రత్యేక బైక్ ర్యాలీ నిర్వహించబడింది.
ఈ ర్యాలీలో మచిలీపట్నం టౌన్ సర్కిల్ మహిళా పోలీసులు, శక్తి టీమ్స్, స్పెషల్ పార్టీ మహిళా పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. బైక్ ర్యాలీ బందర్ కోనేరు సెంటర్ నుండి ప్రారంభమై, లక్ష్మీ టాకీస్ సెంటర్, పరాసుపేట, కోటవారి తుళ్ల సెంటర్ మీదుగా తిరిగి కోనేరు సెంటర్ వద్ద ముగిసింది. ఈ సందర్భంగా మహిళా పోలీసులు ద్విచక్ర వాహనాలు నడిపిస్తూ, ట్రాఫిక్ నియమాల ప్రాముఖ్యత, హెల్మెట్ ధరించడం ఎంత అవసరమో ప్రజలకు స్పష్టంగా వివరించారు.
ఈ కార్యక్రమంలో టౌన్ మరియు ట్రాఫిక్ ఎస్ఐలు, ఇంచార్జ్ డిటిఓ శ్రీనివాస్ నాయక్ , ఎంవిఐ సిద్దిక్ , ఏఎంవీఐ సోనీ ప్రియా తదితర అధికారులు

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app