SAKSHITHA NEWS

National Newborn Safety Week in Khammam

ఖమ్మంలో జాతీయ నవజాత శిశువుల సురక్ష వారోత్సవం

సాక్షిత ఖమ్మం బ్యూరో చీఫ్:

ఖమ్మం జిల్లా లో శుక్రవారం నుండి డిసెంబర్ 1 వ తేది వరకు జాతీయ నవజాత శిశువుల సురక్షావారంగా కేంద్ర ప్రభుత్వం ఆదేశాలమేర జరపాలని, జిల్లాలో జన్మించే ప్రతి బిడ్డ సురక్షితంగా జీవించేందుకు తగిన సమయంలో తగిన చికిత్సలు అందించాలని ప్రోగ్రాం అధికారి (పిల్లల వ్యాధి నిరోధక టీకాల) డా.ప్రమీల తెలిపారు.

ఈసందర్భంగా న జిల్లా ఆసుప త్రిలో ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డా. బి.వెంక టేశ్వర్లు అద్యక్ష తన ఈ కార్యక్ర మాన్ని ప్రారంబించి మాట్లాడుతూ నవజాత శిశువుల్లో మొదటి నెలలోపు ఎక్కువ మంది మృత్యువాతపడుతున్నారని,

వాటిని తగ్గించేందుకు ముఖ్యంగా తల్లిపాలు తప్పనిసరిగ్గా తల్లులచే ఇప్పించాలని, బిడ్డకు వేడి తగిలే విధంగా కంగారు పద్దతి ప్రతి తల్లి అరలింబించే విధంగా మనసిబ్బంది అవగాహన కల్పించాలని ఆయన కోరారు. ముఖ్యంగా ఎస్ ఎన్ ఏస్ యూ లో చికిత్స తీసుకొని డిబ్చార్జ్ అయిన పిల్లలకు ఫాలోఆప్ చికిత్సలు అందించే విధంగా సబ్బది కృషిచేయాలని తెలిపారు.

గ్రామీణ ప్రాంతంలో గల హైరిస్క గర్బవతులను సకాలంలో గుర్తించి వారికి కావలసిన సేవలు, చికిత్సలు అందించేందుకు, వారు ఎక్కడ ప్రపరం కావాలో, అక్కడగల వసతుల గురించి చికిత్స చి గురించి వారికి అవగాహన కల్పించాలని తద్వారా శిశుమరణాల తగ్గించవచ్చని డా. ప్రమీల తెలిపారు.

జిల్లాలో శుక్రవారం రోజునుండి ఆషాలు, ఎ.ఎన్. ఎంబ ప్రతిఇంటిని దర్శించినన జాత శిశు రక్షణ కార్యక్రమాలు చేపట్టాలని ఆమె తెలిపారు. కార్యక్రమ’ ముఖ్య ఉద్దేశ్యాన్ని ప్రజలలో ముఖ్యంగా తల్లులుకు, గర్బిణీలకు వివరించాలని, తద్వారా ప్రసవిస్తూ ఎతల్లి చనిపోకూడదు ప్రసవించిన ఏ బిడ్డ మరణించకూడదు” అనే నినాదం తో పనిచేయాలని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమం లో ఏస్ ఎన్ యస్ యూ పోడల్ అధికారి డా॥ పవన్, చిన్న పిల్లల చికిత్సా నిపుణులు డా. ప్రియాంక మరియు సిబ్బంది పాల్గొన్నారు.


SAKSHITHA NEWS