ఎమ్మెల్యేలు కొడాలి నాని, వల్లభనేని వంశీ మోహన్ లను జాతీయ స్థాయి పోటీలకు ఆహ్వానించిన నిర్వాహకులు….*
సాక్షితగుడివాడ : -కళలకు పుట్టినిల్లు అయిన గుడివాడలో, కళాకారులను ప్రోత్సహించే కార్యక్రమాలు జరగడం హర్షణయం – ఎమ్మెల్యే వంశీ మోహన్…
-నేటి తరాలకు సాంప్రదాయ కళల గొప్పతనాన్ని తెలిపే కార్యక్రమాలను నిర్వహించడం అభినందనీయం-ఎమ్మెల్యే కొడాలి నాని…
కృష్ణా ఆర్ట్ & కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 7, 8, 9 తేదీల్లో గుడివాడ ఎస్పిఎస్ మున్సిపల్ ఉన్నత పాఠశాల ఆవరణలోని కృష్ణ ఆర్ట్స్ కళావేదికపై నిర్వహించనున్న జాతీయస్థాయి ఆహ్వాన నాటిక పోటీలు మరియు సరిగమ సంగీత పరిషత్ రాష్ట్రస్థాయి పాటల పోటీల ఆహ్వాన పత్రికలను అసోసియేషన్ అధ్యక్షుడు పి వి సత్యనారాయణ, సమన్వయకర్త RVL నరసింహారావు ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, కొడాలి నానీలకు అందజేసి పోటీల్లో పాల్గొనాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.నాటక రంగం కనుమరుగవుతున్న నేటి ఆధునిక యుగంలో, మనకే ప్రత్యేకమైన కలలను నేటి తరానికి తెలియజేయడమే కాకుండా, కళాకారులను ప్రోత్సహించే కార్యక్రమాలను నిర్వహించడం అభినందనీయమని ఎమ్మెల్యేలు కొడాలి నాని, వల్లభనేని వంశీ అన్నారు. కళాకారులకు పుట్టినిల్లు అయిన గుడివాడ గడ్డపై కృష్ణా ఆర్ట్ కల్చరల్ అసోసియేషన్ నిర్వహిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలను ప్రోత్సహిస్తామని, ఈ పోటీల్లో ప్రజానికం పాల్గొని విజయవంతం చేయాలని ఎమ్మెల్యేలు విజ్ఞప్తి చేశారు.