రాజమహేంద్రవరంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మీడియా సమావేశం వివరాలు
ఒక్క చాన్స్ అంటూ వచ్చిన జగన్ కు ప్రజలకు 151 సీట్లు, 23 లోక్ సభ ఎంపీ సీట్లు ఇచ్చారు. కానీ సీఎం అయ్యాక తీసుకున్న తొలి నిర్ణయం కూడా విధ్వంసమే..ప్రజా వేదిక కూల్చేశారు.
చంద్రబాబును ఎలాగైనా రిమాండ్ కు పంపాలన్నదే సైకో కోరిక.
నాలుగున్నరేళ్లుగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కోవిడ్ సమయంలో ఎమ్మిగనూరులో మిస్బా అనే యువతిని వైసీపీ నేతలు అత్యాచారం చేసి చంపేస్తే కేసు పెట్టలేదు.• అమర్నాథ్ గౌడ్ అనే పిల్లాడికి నోట్లో పేపర్లు కుక్కి పెట్రోల్ పోసి చంపితే చర్యలు తీసుకోలేదు. నంద్యాలలో అబ్దుల్ కలాం కుటుంబాన్ని అపనిందతో వేధిస్తే వేధింపులు తాళలేక కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకుంటే నో కేస్.
కర్నూలులోనే ఓ కానిస్టేబుల్ ను కొట్టి చంపితే నో కేస్. గంజాయి స్మగర్లపై కేసులు లేవు..వైసీపీ నేతలు వేధించినా కేసులు లేవు.
కానీ టీడీపీ, జనసేన నేతలు ప్రజల సమస్యలపై పోరాడుతుంటే కేసులు పెడుతున్నారు. ఇతర పార్టీలనూ వేధిస్తున్నారు. నాపైన ఈ ప్రభుత్వం వచ్చాక 20 కేసులు పెట్టారు..హత్యాయత్నం కేసులు కూడా పెట్టారు.
రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ వస్తుంటే ఎయిర్ పోర్టు అధికారులకు ఎస్పీ ఫోన్ చేసి ల్యాండ్ అవ్వకుండా చేశారు.
పవన్ వస్తే అలజడితో శాంతిభద్రతలు తలెత్తుతాయని అన్నారు. రోడ్డు మార్గంలో వస్తుంటే బార్డర్ లో యుద్ధ వాతావరణం సృస్టించారు. పవన్ ఎక్కిడికి వెళ్లారు..ఆయన పార్టీ ఆఫీసుకు వెళ్లారు.
చంద్రబాబు పుంగనూరులో ప్రచారం చేస్తుంటే వైసీపీ కార్యకర్తలు రాళ్లు వేశారు..దీనిపై పోలీసులు చర్యలు తీసుకోలేదు. దీంతో మా కార్యకర్తలు తిరిగబడితే తిరిగి వారిపైనే కేసులు పెట్టి 400 మందిని జైల్లో పెట్టారు.• యువగళం పాదయాత్ర బీమవరంలో శాంతియుతంగా సాగింది..సైకో పోవాలి..సైకిల్ రావాలి పాటకు వైసీపీ సైకోలు డ్యాన్సులు వేస్తూ మాపై, మహిళలపై రాళ్ల దాడి చేశారు, అయినా వాళ్లపై కేసులు పెట్టలేదు.
39 మంది వాలంటీర్లపై హత్యాయత్నం కేసులు పెట్టి రాజమండ్రి జైల్లో పెట్టారు.
చంద్రబాబు సైబరాబాద్ నిర్మించడంతో లక్షలాది మంది యువత ఉద్యోగాలు చేస్తున్నారు. అక్కడి భూములు కోట్ల రూపాయలు పలుకుతున్నాయంటే చంద్రబాబు అభివృద్ధి చేయడం వల్లే.• అక్రమంగా కేసులు పెట్టి చంద్రబాబు నిర్మించిన రాజమండ్రి జైల్లోనే ఆయన్ను కట్టేశారు.• ఏం తప్పుచేశారని చంద్రబాబుగారిని అన్యాయంగా జైలులో పెట్టారు? అమరావతి కట్టినందుకా, పోలవరం 72 శాతం పూర్తి చేసినందుకా, కియా తెచ్చి 25 వేల మందికి ఉద్యోగాలు ఇచ్చినందుకా, హెచ్.సీఎల్, ఫాక్స్ కాన్, టీసీఎల్, జోహో లాంటి పరిశ్రమలు తెచ్చినందుకు చంద్రబాబును జైల్లో పెట్టారా?
పసుపు కుంకుమ ఇచ్చినందుకా, రూ.200 ఉన్న పెన్షన్ రూ.2 వేలు చేసినందుకా, ప్రజలకు 100 రకాల సంక్షేమ పథకాలు పెట్టినందుకు చంద్రబాబును జైల్లో పెట్టారా?
ములాఖత్ లో పవన్, బాలకృష్ణ, నేను చంద్రబాబుతో మాట్లాడాక ప్రభుత్వ దమనకాండపై యుద్ధం ప్రకటించాలని నిర్ణయించాం.
చట్టాల అతిక్రమించిన వారిపై సివిల్ వార్ తప్పదు. 2024 ఎన్నికల్లో అందరం కలసి పోరాడుతాం. రాష్ట్ర చరిత్రలో ఇది కీలక నిర్ణయం. ఇది ప్రజల కోసం, ఏపీ ప్రజలు ప్రశాంతంగా బతకడం కోసం తీసుకున్న నిర్ణయం.
అంతా కలసి పోరాడుతాం..జనసేన, టీడీపీ నుండి కమిటీ వేస్తాం. రాబోయే రోజల్లో పోరాటాన్ని ఉద్ధృతం చేసి, సైకోను తాడేపల్లి ప్యాలెస్ లో తాళం వేస్తాం.
చంద్రబాబు సింహం లాంటి వ్యక్తి. లోపల ఉన్న సైకోకు చెమటలు పట్టిస్తున్నారు. ఆయన ఎక్కడున్నా ఆపలేరు.• చంద్రబాబును పవన్ చూడగానే ఆవేదన, బాధ వ్యక్తం చేశారు. వచ్చేటప్పుడు హైటెక్ సిటీని చూసి వస్తూ మంచి వ్యక్తిపై పనికిమాలిన ఆరోపణలు చేసి జైల్లో పెట్టారని పవన్ అన్నారు.
కలసికట్టుగా ఈ ప్రభుత్వంపై పోరాడాలని చంద్రబాబు అన్నారు. చంద్రబాబుకు మందులు అందుతున్నాయో లేదో అధికారులే చెప్పాలి.
అందరూ ప్రభుత్వం చేతిలో బాధితులే. మీడియాపైనా దాడి చేస్తున్నారు..జీవోలు తెచ్చి గొంతు నొక్కుతున్నారు. రైతులపైనా అట్రాసిటీ కేసులు పెడుతున్నారు. ఎస్సీలపైనే అట్రాసిటీ కేసులు పెడుతున్నారు. ఇప్పటికీ మేము పోరాడకపోతే మేము రాజకీయాల్లో ఉండి ఏం ప్రయోజనం? వాళ్లు రాసిన స్క్రిప్ట్ మేము చదవాలా?
టీడీపీ – జనసేన జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేసి అరాచక ప్రభుత్వంపై పోరాడతాం. బీజేపీ మాతో వస్తుందా అన్నది బీజేపీనే చెప్పాలి.• రాష్ట్రంలో హోంమినిస్టర్ ను ఇంటికే పరిమితం చేశారు. డీఎస్పీ, ఎస్పీల బదిలీలు హోంమంత్రికి తెలీదు. అలాంటామెకు చంద్రబాబు భద్రత గురించి ఏం తెలుస్తుంది?• చంద్రబాబు 14 ఏళ్లు సీఎంగా చేసిన వ్యక్తి..ఆయనకు క్లాస్-ఏ సదుపాయాలు కల్పించాలి..కానీ ఇవ్వడం లేదు. గత 42 ఏళ్లుగా చంద్రబాబు రాజకీయాల్లో ఉన్నారు..కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దీంతో కొంత మంది నక్సలైట్లు, స్మగ్లర్లు, గంజాయి స్మగర్లు శత్రువులుగా మారారు..వారంతా రాజమండ్రి జైల్లోనే ఉన్నారు.
మరి చంద్రబాబుకు భద్రత ఎలా ఉంటుంది? మేము జైలు గేటు దగ్గరకు వెళ్లగానే ఇంటిలిజెన్స్ అధికారి నన్ను, బాలకృష్ణను ఫోటోలు తీశారు. అతను ఎవరని డీఎస్పీ, ఎస్సైని అడిగితే స్పందించలేదు.
మా ఎదురుగానే ఫోటోలు తీస్తున్నారంటే ఇక చంద్రబాబు భద్రతపై మాకు భయం ఉండదా.? దక్షిణ భారతదేశంలో ఎన్ఎస్జీ భద్రత ఉన్న ఏకైక వ్యక్తి చంద్రబాబు..ఆయనకు కనీసం వేడినీళ్లు ఇవ్వడం లేదు.
చంద్రబాబు ప్రజల తరపున పోరాడినందుకే నా తల్లిని అవమానించారు..నన్ను దూషించారు..బ్రాహ్మణిపైనా పోస్టులు పెట్టారు. అడుగడుగునా మాపై తప్పుడు పోస్టులు పెట్టారు.
పవన్ పైనా తప్పుడు ప్రచారం చేస్తూ..కుటుంబాలను రోడ్డుకు లాగుతున్నారు. నాకు అన్నగా, అమ్మకూ పవన్ కళ్యాణ్ ఒక మాట చెప్పారు..శాసనసభ సాక్షిగా వైసీపీ నేతలు మిమ్మల్ని అవమానించినప్పుడు బాధపడ్డానని, మళ్లీ మీ మొహంలో నవ్వు కనబడేలా కలసి పని చేస్తామని అన్నారు.
పార్టీలకతీతంగా మహిళకు అన్యాయం జరిగితే పవన్ స్పందించారు. జగన్ జైలుకెళ్లిన సమయంలో మేము టపాసులు పేల్చలేదు..జగన్ కుటుంబ సభ్యులను అవమానించలేదు.
జగన్ తల్లి విజయలక్ష్మి భారీ తేడాతో విశాఖలో ఓడిపోయారు..అయినా మేము ఏనాడూ ఎగతాళి చేయలేదు.. ఇది ప్రజలు, మహిళలు ఆలోచించాలి.
ప్రజల కోసం పోరాడుతున్నందుకు నా తల్లి, భార్యను అవమానిస్తున్నారు.• ఏ వర్గానికీ చంద్రబాబు ద్రోహం చేయలేదు..చంద్రబాబు ఏం ద్రోహం చేశారో వాళ్లు సమాధానం చెప్పాలి.
ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, కాపు, శెట్టిబలిజలకు చంద్రబాబు ఏం అన్యాయం చేశారో చెప్పాలి.
బ్యాంక్ లో పని చేసే ఉద్యోగి తప్పు చేస్తే చైర్మన్ ను జైల్లో వేస్తారా..పాలసీని మాత్రమే చంద్రబాబు ప్రవేశపెట్టారు.
కాపులకు కార్పొరేషన్ ఏర్పాటు చేసి నిధులు కేటాయించి, ఖర్చు చేసింది చంద్రబాబే. ఎవరేం చేశారో చర్చిద్దామంటే ఒక్కరు కూడా రాలేదు.• టిడిపి,జనసేన ఉమ్మడి కమిటీని ఏర్పాటుచేసుకుని భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాం. వైసీపీ ప్యాకప్ అయ్యే టైం వచ్చింది..అందుకే ప్యాకేజీ అంటూ మాట్లాడుతున్నారు.• ఎక్కడ ప్యాకేజీ ఇచ్చారో యంత్రాంగం ద్వారా నిరూపించమనండి. మేం భయపడం..తప్పు చేయలేదు. రాజకీయాల్లోకి ఎప్పుడూ మా అమ్మ రాలేదు.
అనుభవం ఉన్న వ్యక్తి రాష్ట్రానికి సీఎం కావడం అవసరం. ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడాలన్నదే అందరి లక్ష్యం. రేపో, మాపో నన్ను జైలుకు పంపతామని వైసీపీ నేతలు అంటున్నారు.. తప్పు చేయలేదు కాబట్టి నేను భయపడను
నాకు తప్పు చేయాల్సిన అవసరం లేదు. హెరిటేజ్ లో పది శాతం షేర్లు మేము అమ్ముకుంటే రూ.250 కోట్లు వస్తాయి..అలాంటిది మేము తప్పు చేయాల్సిన అవసరం లేదు.
దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు చంద్రబాబుకు అండగా నిలబడతామని, అరెస్టును కూడా ఖండించారు.• చంద్రబాబును అక్రమంగా లోపల వేశారు కాబట్టే మా నిర్ణయాలు గేటు బయట తీసుకోవాల్సి వచ్చింది. చంద్రబాబును కలసినప్పుడు ప్రజల కోసం పోరాడాలన్న చర్చమాత్రమే వచ్చింది.• చంద్రబాబుకే రక్షణ లేకపోతే సామాన్యుడు రోడ్డుపై తిరిగే స్వేచ్ఛ ఉందా..సైకోను శాశ్వతంగా ఇంటికి పంపాలన్న లక్ష్యంతోనే టీడీపీ-జనసేన సివిల్ వార్ ప్రకటించాయి.
చంద్రబాబును అరెస్టు చేయడానికి వచ్చిన అధికారుల కాల్ డేటా తీసుకుని విచారణ చేయాలని మాత్రమే కోర్టులో మేం అడిగాం
శాంతియుతంగా హైదరాబాద్ లో ఐటీ ఉద్యోగులు నిరసన వ్యక్తం చేశారు..విదేశాల్లో ఉన్న తెలుగువారు కూడా చంద్రబాబుకు మద్ధతుగా నిలిచారు.
నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ…
ప్రజల్ని మేము కుటుంబంలా భావిస్తాం. వ్యవస్థలను ఈ ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. మహిళలు, వారి కార్యకర్తలపైనే ఈ ప్రభుత్వం దాడులు చేయిస్తోంది.
రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా..నియంత ఉన్నారా అనిపిస్తోంది.
దెబ్బకు దెబ్బ..వేటుకు వేటు ఉంటుంది. కేసులు భయపడాల్సింది వైసీపీ వాళ్లే. పవన్, నేను, లోకేష్ చంద్రబాబును కలిశాం..రాష్ట్రాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని చంద్రబాబు అన్నారు.
అడ్డదారిలో మమ్మల్ని నైతికంగా దెబ్బతీయాలని చూశారు. కార్యాచరణపై చర్చించాం. పవన్ కళ్యాణ్ కూడా యుద్ధంలో పాల్గొంటామని చెప్పారు. జగన్ కు మతిస్థిమితం లేదు..పాలన గాలికొదిలేశారు. ఇది ప్రజల దౌర్భాగ్యం.
స్కిల్ డెవలెప్మెంట్ ఫైల్ లో కనీసం చంద్రబాబు సంతకం కూడా లేకపోయినా జైల్లో పెట్టారు. జగన్ పాలనలో ల్యాండ్, లిక్కర్, శాండ్ మాఫియాలు విజృంభిస్తున్నాయి.
రాష్ట్రం ఎటుపోతుందోనన్న ఆందోళన చంద్రబాబులో ఉంది. యువశక్తి నిర్వీర్యమైంది. చంద్రబాబు కేవలం పాలసీ మేకర్..దానికి ఆయన బాధ్యుడు కాదు. స్కిల్ డెవెలప్మెంట్ ఎండీగా ప్రేమచంద్రారెడ్డే ఉండి నిధులు విడుదుల చేయించారు.
2021లో పెట్టిన ఎఫ్ఐఆర్ లో చంద్రబాబు పేరే లేదు. ప్రజల్లో వ్యతిరేకత రావడం వల్లే ఓడిపోతామన్న భయంతోనే కేసులు పెట్టారు.